Megastar Chiranjeevi : చిరంజీవితో అక్కినేని అమల నటించిన సినిమా ఏదో తెలుసా ?.. క్లాప్ కొట్టిన తలైవా..
రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీలో చిరు సరసన అక్కినేని అమల కథానాయికగా అలరించారు. వీరిద్దరు కలిసి నటించిన ఏకైక చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమాను స్కంధ ఆర్ట్స్ బ్యానర్ పై అమర్నాథ్ రెడ్డి నిర్మించగా.. 1989 ఆగస్ట్ 7న బెంగుళూరులో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఆ సమయంలో అక్కడే రజినీకాంత్, రవిచంద్రన్ హీరోలుగా నటిస్తోన్న శాంతి క్రాంతి సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది.

మెగాస్టార్ చిరంజీవి.. సినీపరిశ్రమలో ఎంతో మంది నటీనటులకు స్పూర్తి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరు..ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. దాదాపు 150కిపై సినిమాల్లో డాన్స్, యాక్టింగ్, ఎమోషనల్, కామెడీతో ప్రేక్షకులను అలరించారు. ఆయన సినీ ప్రస్థానంలో వన్ ఆఫ్ ది హిట్ మూవీ రాజా విక్రమార్క. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీలో చిరు సరసన అక్కినేని అమల కథానాయికగా అలరించారు. వీరిద్దరు కలిసి నటించిన ఏకైక చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమాను స్కంధ ఆర్ట్స్ బ్యానర్ పై అమర్నాథ్ రెడ్డి నిర్మించగా.. 1989 ఆగస్ట్ 7న బెంగుళూరులో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఆ సమయంలో అక్కడే రజినీకాంత్, రవిచంద్రన్ హీరోలుగా నటిస్తోన్న శాంతి క్రాంతి సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది.
ఒకే రోజు ఇటు చిరంజీవి,. అమల సినిమా స్టార్ట్ కావడంతో అక్కడే ఉన్న తలైవా ముఖ్య అతిథిగా వచ్చి చిరంజీవి, రాధిక, అమల మధ్య వచ్చే సీన్ పై క్లాప్ కొట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Rajini Kanth, Chiranjeevi
View this post on Instagram
రాజా విక్రమాక్ర సినిమా సమయంలో చిరు ఓ హిందీ సినిమా చేయాల్సి ఉంది. దీంతో ఇటు రాజా విక్రమాక్ర, అటు హిందీ సినిమా ఎలా చేయాలని తర్జన బర్జన పడ్డారట చిరు. అదే సమయంలో డైరెక్టర్ సలహా తీసుకుని రాజా విక్రమార్క సినిమా కాకుండా హిందీలో ప్రతిబంధ్ మూవీ చేశారు. ఈ సినిమాతోనే చిరు హీరోగా.. అల్లు అరవింద్ నిర్మాతగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
View this post on Instagram
రాజా విక్రమార్క.. మెగాస్టార్ చిరంజీవి, రవిరాజ పినిశెట్టి కాంబోలో వచ్చిన ఐదవ చిత్రం. తమిళంలో ప్రభు హీరోగా వచ్చిన మై డియర్ మార్తాండం సినిమాకు రీమేక్. 1990లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రానికి రాజ్ కోటి సంగీతం అందించారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
