Janhvi Kapoor : జాన్వీ కపూర్ చిన్నమ్మ తెలుగులో తోపు హీరోయిన్.. అప్పట్లో కుర్రాళ్ల కలల రాణి.. ఎవరంటే..
బాలీవుడ్ ఇండస్ట్రీలోని అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో జాన్వీ కపూర్ ఒకరు. దివంగత నటి శ్రీదేవి కూతురిగా సినీరంగంలోకి అడుగుపెట్టి ఇప్పుడు కథానాయికగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీపై ఫోకస్ చేసిన ఈ వయ్యారి.. తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది.

సినీప్రియులకు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. దివంగత హీరోయిన్ అందాల తార శ్రీదేవి కూతురిగా సినీరంగంలోకి అడుగుపెట్టింది జాన్వీ. ధడక్ సినిమాతో వెండితెరకు కథానాయికగా పరిచయమై మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. తొలి చిత్రానికే నటిగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత హిందీలో విభిన్న కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే దేవర సినిమాతో తెలుగు తెరకు పరిచమయైంది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో జాన్వీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం రామ్ చరణ్ సరసన పెద్ది మూవీలో నటిస్తుంది జాన్వీ. ఇందులో పక్కా పల్లెటూరి అమ్మాయిల కనిపించనుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా జాన్వీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.
అదెంటంటే.. జాన్వీ చిన్నమ్మ.. అలియాస్ పిన్ని సైతం తెలుగులో తోపు హీరోయిన్. అవువు.. ఒకప్పుడు అగ్రకథానాయికగా టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. ఇంతకీ ఆమె ఎవరంటే.. ఒకప్పటి హీరోయిన్ మహేశ్వరి. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మహేశ్వరి శ్రీదేవి చెల్లెలు. అంటే కజిన్ అన్నమాట. జేడీ చక్రవర్తి నటించిన గులబీ సినిమాతో కథానాయికగా ఫేమస్ అయ్యింది మహేశ్వరి. అప్పట్లో ఈ మూవీ బాక్సాఫీస్ సంచలనం. ఆ తర్వాత తెలుగులో వడ్డే నవీన్ నటించిన పెళ్లి సినిమాతో మరో సూపర్ హిట్ అందుకుంది. ఇప్పటికీ ఈ సినిమాలోని సాంగ్స్ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. తెలుగుతోపాటు తమిళంలోనూ వరుస సినిమాల్లో నటించింది మహేశ్వరి.
1994లో భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం కరుత్తమ్మ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది మహేశ్వరి. ఆ తర్వాత గులాబీ సినిమా ఆమెకు బ్రేక్ ఇచ్చింది. తెలుగులో జగపతి బాబు, రవితేజ, జేడి చక్రవర్తి వంటి హీరోలతో కలిసి నటించి మహేశ్వరి. సినిమాలతోపాటు సీరియల్స్ సైతం చేసింది. ముఖ్యంగా మై నేమ్ ఈజ్ మంగతాయారు సీరియల్ ద్వారా తెలుగు ప్రజల మనసులను దోచుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న మహేశ్వరి ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేస్తుంది. అప్పుడప్పుడు జాన్వీతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటుంది మహేశ్వరి.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..
