AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మబాబోయ్..! లైఫ్ ఆఫ్ పై నటి గుర్తుందా.? ఇప్పుడు చూస్తే షాక్ అవ్వాల్సిందే

హాలీవుడ్ సినిమాలకు మనదగ్గర విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇప్పటికే చాలా సినిమాలు మన దగ్గర విడుదలై భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇక ఏవైంజర్స్ లాంటి సినిమాలు మన దగ్గర ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి వాటిలో లైఫ్ ఆఫ్ పై సినిమా ఒకటి.

అమ్మబాబోయ్..! లైఫ్ ఆఫ్ పై నటి గుర్తుందా.? ఇప్పుడు చూస్తే షాక్ అవ్వాల్సిందే
Life Of Pi
Rajeev Rayala
|

Updated on: Apr 29, 2025 | 9:08 AM

Share

హాలీవుడ్ సినిమాలకు మన దగ్గర ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హాలీవుడ్ లో విడుదల అయ్యే సినిమాలు తెలుగులోనూ డబ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక మరెవెల్ సినిమాకు మనదగ్గర విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. అంతే కాదు లైఫ్ అఫ్ పై సినిమా కూడా మనదగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా లైఫ్ అఫ్ పై అనేది 2001 లో రచింపబడిన ప్రసిద్ధ నవల. ఈ నవల ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. యాన్‌ మార్‌ట్టెల్ అనే ప్రముఖ రచయిత ఈ నవలను రచించాడు. ఈ నవల ఆధారంగా అంగ్ లీ దర్శకత్వంలో అదే పేరుతో సినిమాగా తీసారు. లైఫ్ అఫ్ పై అనేది ఒక వ్యక్తి టీనేజ్ లో జరిగిన విచిత్ర సంఘటనలు, అనుభవాలు పై ఒక రచయితకు చెప్పే తన కథ ఇది.

పై పటేల్ పాండిచ్చేరీలో ఒక జూ యజమాని కొడుకు. అమ్మ, నాన్న, అన్నతో కలిసి తాను జీవనం సాగిస్తూ ఉంటాడు. అయితే అనుకోని కారణాల వల్ల పై పటేల్ ఫ్యామిలీ జూ లోని జంతువులతో సహా కెనడా వెళ్లాలని నిర్ణయించుకుంటారు. అయితే జూలోని కొన్ని జంతువులను అమెరికాలోని ఓ జూకు అమ్మేస్తారు. ఈ మేరకు ఆ జంతువులని ఓడలో కెనడా తీసుకెళ్ళి అక్కడ అప్పగించాలని ఒప్పందం కుదుర్చుకుంటారు.

అయితే జంతువులను తీసుకొని పసఫిక్ మహా సముద్రం మీద ప్రయాణం చేస్తుంటాడు. ఇంతలో ఓ తుఫాను రావడంతో ఆ ఓడ మునిగిపోతుంది. చిన్న లైఫ్ బోట్లోకి పై పటేల్ చేరుతాడు.అతనితో పాటు ఓ పులి కూడా ఆ బోట్ లో ఉంటుంది. ఆతర్వాత ఏం జరుగుతుంది. అతను ఎలా ఆ సముద్రం నుంచి బయట పడ్డాడు. ఇక ఈ సినిమాలో ఓ హీరోయిన్ ను కూడా చూపించారు. ఫస్ట్ ఆఫ్ లో పై పటేల్ ఓ అమ్మాయికి ఫిదా అవుతాడు. క్లాసిక్ డాన్స్ చేసే ఓ అమ్మాయిని ఇష్టపడతాడు పై పటేల్. ఆ అమ్మయి గుర్తుందా.? ఆ అమ్మయి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? ఆమె పేరు శ్రవంతి సాయినాథ్. లైఫ్ అఫ్ పై సినిమాలో టీనేజ్ యువతిగా కనిపించిన ఆమె ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. లైఫ్ అఫ్ పై సినిమా తర్వాత శ్రవంతి సాయినాథ్ మరో సినిమాలో కనిపించలేదు. సినిమాలకు దూరమైన ఈ చిన్నది సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి ఇంత ఫిట్‌గా ఎలా ఉంటారు? సీఎం ఆరోగ
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి ఇంత ఫిట్‌గా ఎలా ఉంటారు? సీఎం ఆరోగ
పరిచయం నుంచి నిశ్చితార్థం వరకు.. కట్‌చేస్తే, పోలీసుల రంగప్రవేశం
పరిచయం నుంచి నిశ్చితార్థం వరకు.. కట్‌చేస్తే, పోలీసుల రంగప్రవేశం
కోసిన బంగాళదుంపలు నల్లబడుతున్నాయా? తాజాగా ఉండాలంటే ఇలా చేయండి..!
కోసిన బంగాళదుంపలు నల్లబడుతున్నాయా? తాజాగా ఉండాలంటే ఇలా చేయండి..!
లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకీ మామ..లుక్ అద్దిరిపోయింది
లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకీ మామ..లుక్ అద్దిరిపోయింది
అప్పుల బాధలో పుట్టిన అద్భుతం.. సేఫ్టీ పిన్ కథ మామూలుగా లేదుగా..
అప్పుల బాధలో పుట్టిన అద్భుతం.. సేఫ్టీ పిన్ కథ మామూలుగా లేదుగా..
పాత బావిలో విషవాయువు.. నలుగురు మృతి
పాత బావిలో విషవాయువు.. నలుగురు మృతి
ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పం బాండెడ్‌ క్రేట్‌
ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పం బాండెడ్‌ క్రేట్‌
బ్రహ్మంగారు చెప్పిందే జరుగుతుందా..! 2030 నాటికి బంగారం ధర..
బ్రహ్మంగారు చెప్పిందే జరుగుతుందా..! 2030 నాటికి బంగారం ధర..
హీరో, హోండా ఎందుకు విడిపోయాయి? 26 ఏళ్ల అనుబంధం వెనుక ఇంత కథ ఉందా?
హీరో, హోండా ఎందుకు విడిపోయాయి? 26 ఏళ్ల అనుబంధం వెనుక ఇంత కథ ఉందా?
పిల్లల చేతికి మొబైల్ ఇస్తున్నారా? అయితే.. మీ బ్యాంకు ఖాతా ఖాళీ!
పిల్లల చేతికి మొబైల్ ఇస్తున్నారా? అయితే.. మీ బ్యాంకు ఖాతా ఖాళీ!