
మాస్ మహారాజ రవితేజ సినిమా అంటే మినిమమ్ ఎంటర్టైమెంట్ గ్యారెంటీ.. కాకపోతే ఈ ఆమధ్య ఆయన నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాదించడం లేదు. అప్పుడెప్పుడో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా తర్వాత రవితేజ ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయారు. చివరిగా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు కానీ ఆ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. రవితేజ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. వాటిలో కిక్ సినిమా ఒకటి. 2009 లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
కిక్ సినిమాలో రవితేజకు జోడీగా ఇలియానా నటించింది. ఇక ఈ సినిమాలో తమిళ్ నటుడు శ్యామ్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా తర్వాత ఆయన పేరు కిక్ శ్యామ్ గా మారింది. ఇక ఈ కిక్ సినిమాలో బ్రహ్మానందం, రవితేజ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. కిక్ సినిమాలోని ప్రతి సీన్, ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. అయితే సినిమాలో అలీతో రవితేజ చేసే ఫన్ ప్రేక్షకులను విపరీతంగా నవ్వించింది. గతం మర్చిపోయి తానే ఓ డాక్టర్ అని ఫీల్ అయ్యే పాత్రలో అలీ నవ్వులు పూయించారు.
సినిమాలో అలీ క్యారెక్టర్ ను పరిచయం చేసే డాక్టర్ పాత్రలోకనిపించిన నటి గుర్తుందా.? ఆమె సినిమాలో కనిపించింది కొంతసేపే అయినా ఆమె ప్రేక్షకులను ఆకర్షించింది. కిక్ సినిమా సమయంలోనూ ఆమె ఎవరు అంటూ గూగుల్ లో గాలించారు. తాజాగా సోషల్ మీడియాలో ఆమె ఎవరు అంటూ అంటూ ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఆమె ఈమే అంటూ నెటిజన్స్ ఓ నటి పేరు వైరల్ చేస్తున్నారు. ఆమె పేరు కందూరి శ్రీ రంగ సుధా.. ఈ ముద్దుగుమ్మ ఓ నటి.. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. అలాగే మలయాళ భాషలో నటిస్తుంది. మరి కిక్ సినిమాలో నటించింది ఈమేనా కాదా అన్న క్లారిటీ లేకపోయినా.. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఫోటోలు మాత్రం వైరల్ గా మారాయి. అయితే విషయమేమిటంటే.. కిక్ సినిమాలో నటించింది శ్రీ రంగ సుధా కాదు. ఇద్దరూ చూడటానికి ఒకేలా ఉండటంతో ఆమె ఈమె ఒక్కరే అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి అని నిజం కాదు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.