kick Movie: మాస్ రాజా కిక్ సినిమాలో ఇలియానా చెల్లి గుర్తుందా..? ఓ రేంజ్‌లో అందాలతో రెచ్చిపోయిందిగా..

2009 లో విడుదలైన ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించింది. శ్యామ్ కీలక పాత్రలో నటించారు. అలాగే ఈ సినిమాలో రవితేజ, బ్రహ్మానందం మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

kick Movie: మాస్ రాజా కిక్ సినిమాలో ఇలియానా చెల్లి  గుర్తుందా..? ఓ రేంజ్‌లో అందాలతో రెచ్చిపోయిందిగా..
Kick
Follow us
Rajeev Rayala

|

Updated on: May 27, 2023 | 1:44 PM

మాస్ మహారాజ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్స్ మూవీస్ లో కిక్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా మంచి వసూళ్లను కూడా రాబట్టింది. 2009 లో విడుదలైన ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించింది. శ్యామ్ కీలక పాత్రలో నటించారు. అలాగే ఈ సినిమాలో రవితేజ, బ్రహ్మానందం మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క క్యారెక్టర్ అందరికి గుర్తుండిపోతాయి.  ఇక ఈ సినిమాలో ఇలియానా చెల్లిగా నటించిన బ్యూటీ గుర్తుందా..? ముందు రవితేజను ఇష్టపడ్డ అమ్మాయిగా కనిపించి ఆకట్టుకుంది ఈ భామ. ఆమె పేరు ఆషీకా బతిజా.

ఆమె పోషించింది చాలా చిన్న పాత్రే, చిత్రం లో ఆమె కనిపించేది కూడా రెండు మూడు సన్నివేశాల్లోనే కానీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత ఈమెకి అవకాశాలు బాగా వస్తాయని అందరూ ఆశించారు కానీ అలా జరగలేదు. కిక్ సినిమా తర్వాత ఆమె మరో సినిమాలో కనిపించలేదు.

కిక్ సినిమా తర్వాత ఆషీకా బతిజా లండన్ కి పై చదువుల కోసం వెళ్ళింది, ఆ తర్వాత ఈమె మోడలింగ్ రంగం లోకి అడుగుపెట్టి అక్కడే స్థిరపడిపోయింది. తాజాగా ఆమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోల పై మి మీరూ ఓ లుక్కేయండి. Aasheekaa Bathija

Aasheekaa Bathija1