పరుగు సినిమా బ్యూటీ ఇలా మారిపోయిందేంటీ..!! చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. ఇప్పటికి ఈ సినిమా పాటలు వినిపిస్తున్నాయి. 2008లో విడుదలైన ఈ సినిమాతో అల్లు అర్జున్ నంది అవార్డు అందుకున్నారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా షీలా కౌర్ నటించింది. ఈ అందాల భామ ఈ సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది. నవదీప్ హీరోగా నటించిన సీతాకోకచిలుక చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది షీలా.. 

పరుగు సినిమా బ్యూటీ ఇలా మారిపోయిందేంటీ..!! చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!
Parugu
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 11, 2024 | 9:51 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించినా సూపర్ హిట్ సినిమాల్లో పరుగు సినిమా ఒకటి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పరుగు సినిమా బన్నీ కెరీర్ లో వన్ ఆఫ్ ది సూపర్ హిట్ గా నిలిచింది. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. ఇప్పటికి ఈ సినిమా పాటలు వినిపిస్తున్నాయి. 2008లో విడుదలైన ఈ సినిమాతో అల్లు అర్జున్ నంది అవార్డు అందుకున్నారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా షీలా కౌర్ నటించింది. ఈ అందాల భామ ఈ సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది. నవదీప్ హీరోగా నటించిన సీతాకోకచిలుక చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది షీలా.. ఈ చిన్నదాని అందానికి కుర్రకారు ఫిదా అయ్యారు. పరుగు సినిమా తర్వాత షీలా పలు సినిమాల్లో నటించింది. తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలలో నటించింది ఈ చిన్నది. ఎన్టీఆర్ హీరోగా నటించిన అదుర్స్ సినిమాలోనూ నటించింది షీలా.

ప్రస్తుతం షీలా సినిమాలకు దూరంగా ఉంటుంది. 2011లో నటసింహం బాలకృష్ణ నటించిన పరమ వీర చక్ర సినిమాలో కనిపించింది షీలా. ఆతర్వాత ఈ చిన్నది సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. షీలా హీరోయిన్ గానే కాదు చైల్డ్ ఆర్టిస్ట్ గానూ నటించింది. బాలనటిగా దాదాపు 20 సినిమాల వరకు నటించింది.

ఇదిలా ఉంటే షీలా ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవడానికి చాలా మంది నెటిజన్లు గూగుల్ ను గాలిస్తున్నారు. సినిమాలకు దూరమైన షీలా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ.. అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఈ చిన్నదాని లేటెస్ట్ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

షీలా ఇన్ స్టా లేటెస్ట్ ఫొటోస్..

షీలా లేటెస్ట్ ఫొటోస్ ..

షీలా లేటెస్ట్ ఫొటోస్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.