Oye Movie: అమ్మబాబోయ్.!! ఓయ్ మూవీ హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది.. అస్సలు ఊహించలేదు గురూ !!

2009లో విడుదలైన ఈ సినిమాకు ఆనంద్ రంగ దర్శకత్వం వహించారు. 10 కోట్ల తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 47 కోట్ల వరకు వసూల్ చేసింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా షామిలి నటించింది. 

Oye Movie: అమ్మబాబోయ్.!! ఓయ్ మూవీ హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది.. అస్సలు ఊహించలేదు గురూ !!
Oy Movie
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 21, 2023 | 5:53 PM

సిద్ధార్థ్ ఒకప్పుడు లవర్ బాయ్ గా ప్రేక్షకుల విపరీతంగా ఆకట్టుకున్నారు. బాయ్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సిద్ధార్థ్ ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించి మెప్పించారు. తెలుగులో బొమ్మరిల్లు సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకోవడంతో పాటు.. మంచి హిట్ గా నిలిచింది. ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి హిట్స్ అందుకున్నారు. అలాగే ఓయ్ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు సిద్ధార్థ్. 2009లో విడుదలైన ఈ సినిమాకు ఆనంద్ రంగ దర్శకత్వం వహించారు. 10 కోట్ల తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 47 కోట్ల వరకు వసూల్ చేసింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా షామిలి నటించింది.

షామిలి బేబీ షామిలిగా చాలా పాపులర్. ఆమె ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి, అంజలి లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది షామిలి. ఓయ్ సినిమాలో హీరోయిన్ గా నటించిన తర్వాత సినిమాలకు దూరం అయ్యింది ఈ భామ.  చివరిగా’అమ్మమ్మగారిల్లు’ అనే సినిమాలో నటించింది.

తాజాగా షామిలి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పుడు ఆమె లుక్ చూస్తే షాక్ అవుతారు. అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది ఈ హీరోయిన్. ఈ అమ్మడు ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ అమ్మడి ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by Shamlee (@shamlee_official)