Raviteja: అల్లు అర్జున్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథతో బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన రవితేజ.. ఇంతకీ ఏ సినిమా అంటే..
మాస్ మహారాజా రవితేజ సినిమాల కోసం ఫ్యాన్స్ కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న ఈ హీరో.. ఇప్పుడు సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇటీవల రవితేజ నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఇప్పుడుతన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై రవితేజ మరింత ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.

ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ డమ్ సంపాదించుకున్నారు మాస్ మహారాజా రవితేజ. కెరీర్ తొలినాళ్లల్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించి.. ఆ తర్వాత హీరోగా మారారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్, రవితేజ కాంబోలో వచ్చిన ఇడియట్ చిత్రం ఆయన కెరీర్ మలుపు తిప్పింది. ఈ సినిమాతో టాలీవుడ్ లో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు రవితేజ. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన భద్ర బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ మూవీతో మరోసారి విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇందులో మీరా జాస్మిన్ కథానాయికగా నటించింది. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ఏడాదితో ఈ మూవీ విడుదలై 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.
భద్ర సినిమాను ముందుగా ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ రిజెక్ట్ చేశారట. ఆ హీరోస్ మరెవరో కాదు.. అల్లు అర్జున్, ఎన్టీఆర్. వీరిద్దరు మిస్ చేసుకోవడంతో ఈ సినిమా రవితేజ వద్దకు వెళ్లింది. భద్ర సినిమా కథను బోయపాటి ముందుగా తనకు చెప్పారని.. ఆ కాన్సెప్ట్ నచ్చినప్పటికీ డేట్స్ కుదరకపోవడంతో ఆ చిత్రాన్ని వదులుకోవాల్సి వచ్చిందని.. అప్పుడే ఆర్య సినిమా సెట్స్ పై ఉందని.. అందుకే ఆ సినిమా చేయలేకపోయానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అల్లు అర్జున్. కానీ భద్ర మూవీ థ్యాంక్స్ కార్డు తన పేరు పై పడిందని అన్నారు. ఆ తర్వాత కూడా బోయపాటి శ్రీను, బన్నీ కాంబోలో అనేక చిత్రాలు ఆగిపోయాయి. చివరకు వీరి కాంబోలో సరైనోడు సినిమా వచ్చింది.
ఇవి కూడా చదవండి : Tollywood : 14 ఏళ్లకే ఇండస్ట్రీని రూల్ చేసింది.. 16 ఏళ్లకే జాతీయ అవార్డ్.. 21 ఏళ్ల వయసులోనే ఊహించని మరణం..
Mehreen Pirzadaa: ఎఫ్ 2 మూవీ హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడు ఎలా అయ్యిందో చూడండి..
భద్ర సినిమాను అల్లు అర్జున్ తర్వాత ఎన్టీఆర్ వద్దకు వెళ్లింది. ఈ కథ తనకు బోయపాటి చెప్పగానే ఎంతో భయపడ్డానని.. ఆయన చెప్పిన విధానం తనను చాలా భయపెట్టిందని.. అందుకే ఆ సినిమాను వదిలేసుకున్నట్లు ఎన్టీఆర్ తెలిపారు. కానీ ఆ సినిమా మిస్సైనందుకు ఇప్పటికీ బాధపడుతుంటారట. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ బోయపాటి కాంబోలో దమ్ము సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. తెలుగులో భద్ర సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
ఇవి కూడా చదవండి :
Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..
Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..