AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sudha Murthy: ‘అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది’.. స్టార్ హీరో మూవీపై సుధామూర్తి ప్రశంసల వర్షం

ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్, ప్రముఖ రచయిత్రి, రాజ్య‌స‌భ స‌భ్యురాలు సుధా మూర్తి పెద్దగా సినిమాలు చూడరు. వాటి గురించి కూడా ఎక్కువగ మాట్లాడరు. అయితే ఆమె లేటెస్ట్ గా ఒక సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మూవీని తప్పకుండా అందరూ చూడాలని కోరారు. ఇంతకీ ఆ సినిమా ఏదంటే?

Sudha Murthy: 'అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది'.. స్టార్ హీరో మూవీపై సుధామూర్తి ప్రశంసల వర్షం
Sudha Murthy
Basha Shek
|

Updated on: Jun 11, 2025 | 11:49 AM

Share

ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ సుధా మూర్తి ఒక సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా తన ఆలోచనలను పూర్తిగా మార్చేసిందన్నారు. ఈ సినిమా సమాజంలో పెను మార్పులు తీసుకురాగలదని అభిప్రాయపడ్డారు. అందరూ తప్పకుండా ఈ సినిమాను చూడాలని కోరారు. త్వరలో థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రీమియర్ ను ఇటీవల ప్రదర్శించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ స్పెషల్ స్క్రీనింగ్ కు హాజరయ్యారు. అందులో సుధా మూర్తి కూడా ఉన్నారు. ఈ క్రమంలో సినిమా చూసిన అనంత‌రం ఆమె తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు. ‘ఈ సినిమా చూస్తుంటే నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇది కేవలం ఒక సినిమా కాదు, మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసే ఒక అనుభవం. మానసిక వికలాంగులుగా బాధ‌ప‌డుతున్న పిల్లల ఆలోచనలను మనం ఎలా అర్థం చేసుకోవాలి, వారికి ఎలా మద్దతు ఇవ్వాలి అనే అంశాలను ఈ మూవీలో చక్కగా చూపించారు. ఈ చిత్రం ఒక అద్భుతమైన సందేశాన్ని ఇస్తుంది” అని అన్నారు. ప్రతి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ ఈ సినిమాను తప్పకుండా చూడాలి . ఈ సినిమా స‌మాజంలో చాలా మార్పు తీసుకురాగలదు” అని సుధా మూర్తి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

సుధా మూర్తి ప్రశంసలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. దీంతో విడుదలకు ముందే ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతోంది. ప్రేక్షకుల్లో అమితమైన ఆసక్తి నెలకొంది. ఇలా సుధా మూర్తి మన్ననలు అందుకున్న ఆ మూవీ మరేదో కాదు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ నటించిన సితారే జమీన్ పర్. ఆర్‌ఎస్‌ ప్రసన్న తెరకెక్కించిన ఈ ఫీల్ గుడ్ మూవీలో జెనీలియా కథానాయికగా నటించింది. ఆమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆమిర్‌ఖాన్, అపర్ణ పురోహిత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అంతకు ముందే సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా ఈ మూవీ ప్రీమియర్ ఏర్పాటు చేశారు. సుధా మూర్తి కూడా హాజరై ఈ సినిమాను వీక్షించారు. అనంతరం సినిమా అద్భుతంగా ఉందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. మొత్తానికి సినిమా ఇండస్ట్రీకి ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తి, అందులోనూ సుధా మూర్తి నోటి వెంట ఈ సినిమా పేరు వచ్చిందంటే అందులో కచ్చితంగా మంచి విషయం ఉన్నట్లే.

ఆమిర్ ఖాన్ సినిమా గురించి సుధామూర్తి మాటల్లో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.