Tollywood: టాలీవుడ్‌తో తీవ్ర విషాదం – దర్శకుడు రవికుమార్ చౌదరి హఠాన్మరణం
తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి గుండెపోటుతో తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు చిత్రసీమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి మృతి చెందారు. జూన్ 10, మంగళవారం రాత్రి ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. దీంతో సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. గోపీచంద్ హీరోగా నటించిన యజ్ఞం సినిమాతో రవికుమార్ దర్శకుడిగా మారారు. బాలకృష్ణతో వీరభద్ర, నితిన్‌తో ఆటాడిస్తా, సాయి దుర్గ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ.. పిల్లా నువ్వు లేని జీవితం, గోపిచంద్‌తో ‘సౌఖ్యం’ చిత్రాలను తెరకెక్కించారు. రవికుమార్ చివరిగా రాజ్ తరుణ్‌తో తిరగబడరా స్వామి చిత్రాన్ని తెరకెక్కించారు. రవికుమార్ చౌదరి మృతి పట్ల తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ సంతాపం ప్రకటించారు. కాగా రవి కుమార్ చౌదరి నందమూరి కుటుంబానికి వీరాభిమాని.
కొన్ని పరాజయాలు ఎదుర్కొన్నప్పటికీ.. అతని కెరీర్‌లో కొన్ని సినిమాలు ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఇంపాక్ట్ చూపించాయి. ముఖ్యంగా రవికుమార్ చౌదరిచిత్రాలలోని చాలా పాటలు కూడా ప్రజాదరణ పొందాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.