Kajal-Yash: భార్యాభర్తలుగా కనిపించనున్న యష్, కాజల్.. ఇద్దరి మధ్యా వయసు వ్యత్యాసం ఎంతంటే..
దక్షిణాదిలో ఒకప్పుడు తోపు హీరోయిన్ కాజల్ అగర్వాల్. అగ్ర హీరోల అందరి సరసన నటించి స్టార్ స్టేటస్ అందుకుంది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది కాజల్. తాజాగా ఈ అమ్మడు మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసినట్లుగా టాక్ వినిపిస్తుంది.

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా రామాయణ్. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నితీశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా కనిపించనున్నారు. అలాగే బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ హై రేంజ్ చిత్రంలో కన్నడ స్టార్ యశ్ రావణుడి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ కొన్నాళ్ల క్రితం ఈ మూవీ సెట్స్ నుంచి లీకైన ఫోటోస్ మూవీపై మరింత ఆసక్తిని కలిగించాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మండోదరి పాత్రలో హీరోయిన్ కాజల్ కనిపించనుందని టాక్ వినిపిస్తుంది.
ఈ సినమాలో రావణుడి సతీమణి మండోదరి పాత్రలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. అంటే.. ఇందులో రాకింగ్ స్టార్ యశ్ జోడిగా కనిపించనుంది కాజల్. దీంతో మొదటిసారి కాజల్, యశ్ జోడిని స్క్రీన్ పై చూసేందుకు ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం గురించి కూడా చర్చ జరుగుతుంది. నివేదికల ప్రకారం యశ్ 1986 జనవరి 29న జన్మించారు. ఇప్పుడు ఆయన వయసు 39 సంవత్సరాలు. అలాగే కాజల్ 1985 జూన్ 19న జన్మించింది. ప్రస్తుతం ఆమె వయసు 39 సంవత్సరాలు ఉంటుందట. అయితే ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం తక్కువే అని.. దీంతో వీరి జంట స్క్రీన్ పై పర్ఫెక్ట్ గా ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.
అటు రావణుడు, మండోదరి సైతం దాదాపు ఒకే వయసు ఉంటారని.. దీంతో ఇప్పుడు యశ్, కాజల్ జోడి పర్ఫెక్ట్ గా క్లిక్ అవుతుందని అంటున్నారు. అయితే ఇదివరకు మగధీర సినిమాలో మిత్రవింద పాత్రలో కనిపించిన కాజల్.. ఇప్పుడు మరోసారి మండోదరి పాత్రలో మెప్పించడం ఖాయమని అంటున్నారు. ప్రస్తుతం మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప చిత్రంలో పార్వతి పాత్రలో నటిస్తుంది కాజల్. ఇప్పటికే రిలీజ్ అయిన కాజల్ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటుంది.
ఇవి కూడా చదవండి :
Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?
Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..
Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..
Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‌తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..




