Telugu Cinema: మార్షల్ ఆర్ట్‌లో బ్లాక్ బెల్ట్.. ఇండస్ట్రీలోనే క్రేజీ హీరోయిన్.. వివాదాలతో సినిమాలకు దూరం..

ఇండస్ట్రీలో ఒక్క సినిమాతోనే పాపులర్ అయిన స్టార్స్ చాలా మంది ఉన్నారు. అతి తక్కువ సమయంలోనే తమదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కానీ కొందరు హీరోయిన్స్ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఊహించని వివాదాల్లో చిక్కుకుని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కథానాయిక సైతం ఆ జాబితాలోకి చెందినవారే.

Telugu Cinema: మార్షల్ ఆర్ట్‌లో బ్లాక్ బెల్ట్.. ఇండస్ట్రీలోనే క్రేజీ హీరోయిన్.. వివాదాలతో సినిమాలకు దూరం..
Neetu Chandra

Updated on: Jul 12, 2025 | 4:54 PM

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో చాలా మంది కొత్త హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తున్నారు. కొందరు ఫస్ట్ మూవీతోనే విపరతీమైన క్రేజ్ సొంతం చేసుకుంటారు. అలాగే మరికొందరు మాత్రం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నప్పటికీ అంతగా పాపులర్ కాలేకపోయారు. అయితే తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ అందుకున్న తారలు.. అనుహ్యంగా పలు వివాదాలతో ఇండస్ట్రీకి దూరమవుతుంటారు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న తార సైతం అలాగే ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఆమె అందం, అభినయంతోపాటు మార్షల్ ఆర్ట్స్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె టైక్వాండో మార్షల్ ఆర్ట్స్‌లో బ్లాక్ బెల్ట్ కలిగి ఉంది. అలాగే మొదటి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.

ఆమె మరెవరో కాదు.. నీతూ చంద్ర. 13B యావరుమ్ నలం అనే సినిమాతో తమిళ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2005లో కరమ్ మసాలా సినిమాతో హిందీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం భాషలలో వరుస సినిమాల్లో నటించింది మెప్పించింది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నీతు చంద్ర.. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. యాక్టింగ్ తోపాటు నిర్మాణం, క్లాసికల్ డ్యాన్స్, టైక్వాండోలో బ్లాక్ బెల్ట్ వంటి అనేక రంగాలలో రాణించారు. తెలుగులో సుమంత్ నటించిన గోదావరి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది.

ఇవి కూడా చదవండి

అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే అనేక వివాదాలతో నిత్యం వార్తలలో నిలిచింది. 2009లో తెలుగులో ఓ సినిమా చేస్తున్న సమయంలో స్టార్ హీరో తనతో అనుచితంగా ప్రవర్తించడాని ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఆ హీరోతోపాటు అతడి భార్య సైతం తనను వేధిస్తున్నారంటూ ఆరోపణలు చేసింది. అలాగే ప్రముఖ రాపర్ యోయో హనీ సింగ్ పై సైతం ఫిర్యాదు చేసింది. యోయో హానీ సింగ్ విడుదల చేసిన మనియాక్ పాటలో మహిళలను కించపరిచేలా లిరిక్స్ ఉన్నాయంటూ ఆమె ఆరోపణలు చేశారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే పలు వివాదాలతో నిత్యం వార్తలలో నిలిచింది. ప్రస్తుతం ఆమె వ్యాపార రంగంలో బిజీగా ఉంది.

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..