Tollywood: చేసింది మూడు సినిమాలే.. 64 ఏళ్ల నటుడితో ప్రేమ.. చివరకు అపార్ట్మెంట్‏లో ఊహించని విధంగా..

సినీరంగంలో నటిగా ఎదగాలనుకుంటే ఎన్నో సవాళ్లను, కష్టాలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తమదైన ముద్ర వేసిన తారలు చాలా మంది ఉన్నారు. అందులో ఈ అమ్మడు ఒకరు. 18 ఏళ్లకే ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ హీరోలతో నటించే అవకాశం దక్కించుకుంది. కానీ అంతలోనే ఊహించని నిర్ణయం తీసుకుంది.

Tollywood: చేసింది మూడు సినిమాలే.. 64 ఏళ్ల నటుడితో ప్రేమ.. చివరకు అపార్ట్మెంట్‏లో ఊహించని విధంగా..
Jiah Khan

Updated on: Jul 08, 2025 | 7:36 PM

18 ఏళ్లకే ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా సత్తా చాటింది. చిన్న వయసులోనే సినీరంగంలో తనదైన ముద్ర వేసింది. నటిగా ఎదుగుతున్న సమయంలోనే ఏకంగా బిగ్ బీ అమితాబ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. 64 ఏళ్ల నటుడితో 20 ఏళ్ల యువతి ప్రేమకథతో భారీ విజయాన్ని అందుకుంది. కానీ 25 ఏళ్లకే తన ఇంట్లో శవమై తేలింది. ఇండస్ట్రీలో నటిగా ఓ వెలుగు వెలిగి అర్ధాంతరంగా కనుమరుగైన తార… ఇప్పటికీ ఆమె మరణంపై తన తల్లి పోరాడుతూనే ఉంది. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే ప్రేమ, మోసం, వేధింపులతో తన కూతురు ఆత్మహత్య చేసుకుందంటూ ఆమె తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె మరణించి పదేళ్లు పూర్తైనప్పటికీ ఇప్పటికీ ఆమె డెత్ మిస్టరీ మాత్రం వీడలేదు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ జియా ఖాన్.

జియా ఖాన్.. బాలీవుడ్ సినీప్రియులకు పరిచయం అవసరంలేని పేరు. 1988 ఫిబ్రవరి 20న న్యూయార్క్ లో పుట్టిన ఈ అమ్మడు.. రెండేళ్ల వయసులోనే తండ్రి వదిలేయడంతో తన తల్లి రాబియా అమీన్ తో కలిసి లండన్ వెళ్లిపోయింది. చిన్నప్పటి నుంచే కథక్, సల్సా, బ్యాలే వంటి డ్యాన్స్ ట్రైనింగ్స్ తీసుకుంది. ఆ తర్వాత న్యూయార్క్ లోని లీ స్ట్రాస్ బర్గ్ థియేటర్ ఇన్ స్టిట్యూట్ లో చేరి యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంది. చదువు మధ్యలోనే ఆపేసి సినీరంగంలోకి అడుగుపెట్టింది. 2007లో నిశ్శబ్ద్ సినిమాలో నటించింది. తనకంటే 45 ఏళ్ల పెద్దవాడైన లెజండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ సరసన టీనేజ్ గర్ల్ నటించడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. ఆ తర్వాత అమీర్ ఖాన్ సరసన గజిని చిత్రంలో నటిస్తుంది.

ఆ తర్వాత ఆమెకు హిందీలో వరుస ఆఫర్స్ వచ్చాయి. హిందీలో మూడు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటించిన సినిమాలు మొత్తం రూ. 300కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే.. 2013 జూన్ 3న ముంబైలోని తన నివాసంలో ఉరివేసుకుని కనిపించింది. అప్పుడు ఆమె వయసు 25 సంవత్సరాలు మాత్రమే. జియా రాసిన 6 పేజీల సూసైడ్ లెటర్ బయటకు రావడంతో ఆమె ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. నటుడు సూరజ్ పంచోలి ప్రేమ పేరుతో మోసం చేశాడని.. బలవంతంగా అబార్షన్ చేయించాడని ఆ లేఖలో ఆరోపించింది. తన కూతురు ఆత్మహత్య కాదు..హత్యే అంటూ జియా ఖాన్ తల్లి న్యాయం కోసం పోరాడుతుంది.

ఇవి కూడా చదవండి

Jiah Khan New

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..