AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Song: సినిమాల్లో రిజెక్ట్ చేశారని యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన పాట.. కట్ చేస్తే.. 78 మిలియన్ల వ్యూస్‌తో…

ఈ పాటను మొదట ఇండిపెండెంట్ గా రిలీజ్ చేయాలని అనుకోలేదు. ఏదైనా ఒక మంచి సినిమాలో ఉపయోగించాలని అనుకున్నారు. అందులో భాగంగానే ముగ్గురు, నలుగురు దర్శకులను కలిశాడు. అయితే వారెవరూ ఈ పాటను తమ సినిమాల్లో తీసుకోవడానికి ముందుకు రాలేదు. దీంతో చివరకు..

Trending Song: సినిమాల్లో రిజెక్ట్ చేశారని యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన పాట.. కట్ చేస్తే.. 78 మిలియన్ల వ్యూస్‌తో...
Trending Song
Basha Shek
|

Updated on: Aug 27, 2026 | 6:10 PM

Share

‘బేబీ’ సినిమాతో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ బుల్గానిన్‌. ఈ సినిమాలోని పాటలకు జాతీయ అవార్డుతో పాటు ఫిల్మ్ ఫేర్ పురస్కారం కూడా అందుకున్నాడు విజయ్. ప్రస్తుతం దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉంటోన్న సంగీత దర్శకులలో విజయ్ కూడా ఒకరు. అయితే సినిమాల్లోకి రాకముందే ఇండిపెండెంట్ సాంగ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బుల్గానిన్. ఆయన రూపొందించిన పలు పాటలు మ్యూజిక్ లవర్స్ ను కట్టిపడేశాయి. యూట్యూబ్ లోనూ విజయ్ పాటలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. అందులో ‘కోయిల’ అనే పాట కూడా ఒకటి. మనందరికి తెలిసిన తెలుగమ్మాయి, బిగ్ బాస్ ఫేమ్ దేత్తడి హారిక, అలాగే వినయ్ షణ్ముఖ్ ఇందులో జంటగా నటించారు. ఆకట్టుకునే విజువల్స్, వినిసొంపైన సంగీతం, అలేఖ్య హారిక స్క్రీన్ ప్రెజెన్స్, అలాగే వినయ్ షణ్ముఖ్ క్రియేటివ్ ప్రజెంటేషన్.. వెరసి ఈ పాట యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. ఇప్పటివరకు ఈ కోయిలా సాంగ్ కు సుమారు 78 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అంటే దాదాపు 7.8 కోట్ల మందికి పైగా ఈ సాంగ్ ను చూశారన్నమాట. అయితే ఈ ‘కోయిలా’ సాంగ్ గురించి తాజాగా ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే..

‘కొయిల’ పాటను మొదటగా ఒక సినిమాలో ఉపయోగించాలని అనుకున్నారట విజయ్ బుల్గానిన్. అందుకోసం విజయ్ తో పాటు ఆయన టీమ్ పలువురు దర్శకులను సంప్రదించారట. ఏకంగా 3, 4 మంది ఫిల్మ్‌మేకర్స్‌కు ఈ పాటను వినిపించి తమ సినిమాల్లో ఉపయోగించాల్సిందిగా కోరారట. అయితే ఆ దర్శకుల్లో ఎవరూ ఈ పాటను తమ సినిమాల్లోకి తీసుకునేందుకు ముందుకు రాలేదట. దీంతో విజయ్ బృందం ఇండిపెండెంట్ గానే కోయిలా పాటను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారట. కట్ చేస్తే.. ఇప్పుడదే సాంగ్ యూట్యూబ్ లో రికార్డులు బద్దలు కొడుతోంది. సినిమాలో భాగం కాకపోయినప్పటికీ యూట్యూబ్‌లో భారీ వ్యూస్ సాధిస్తూ 78 మిలియన్ల మార్క్‌ను దాటేసిందీ కోయిలా సాంగ్. మరి యూట్యూబ్ లో ట్రెండింగ్ లిస్టులో ఉన్న ఈ సాంగ్ ను మీరు చూశారా? చూడకపోతే వెంటనే చూసేయండి

కోయిలా సాంగ్ మ్యూజిక్ వీడియో..

 

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us