Khaleja Movie: ‘ఖలేజా’ మూవీ కోసం మొదటిగా త్రివిక్రమ్ ఏ హీరోను అనుకున్నారో తెలుసా.?
టాలీవుడ్ టాప్ దర్శకుల్లో త్రివిక్రమ్ ఒకరు. దర్శకుడిగా తన కెరీర్‌ను ప్రారంభించడానికి ముందుగా.. ఎన్నో సినిమాలకు కథ, మాటలు అందించారు..
టాలీవుడ్ టాప్ దర్శకుల్లో త్రివిక్రమ్ ఒకరు. దర్శకుడిగా తన కెరీర్‌ను ప్రారంభించడానికి ముందుగా.. ఎన్నో సినిమాలకు కథ, మాటలు అందించారు ఈ మాటల మాంత్రికుడు. అలా అందించిన వాటిలో చాలా సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకున్న సంగతి తెలిసిందే. ‘నువ్వే నువ్వే’ సినిమాతో తెలుగు తెరకు దర్శకుడిగా మారారు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆ తర్వాత తన దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించారు. అదే సమయంలో బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌లుగా మిగిలినవి కూడా లేకపోలేదు.
అలా త్రివిక్రమ్ దర్శకత్వంలో మంచి హైప్ తెచ్చుకుని.. చివరికి నిరాశపరిచిన సినిమాల్లో ఒకటి ‘ఖలేజా’. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో కాగా.. ఇది బాక్సాఫీస్ దగ్గర మాత్రం కలెక్షన్ల పరంగా నిరాశపరిచింది. అయితేనేం బుల్లితెరపై మాత్రం ‘ఖలేజా’ మూవీకి మంచి టీఆర్పీ లభించింది. కాగా.. ఈ మూవీ కథను మొదటిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్నారట దర్శకుడు త్రివిక్రమ్. అంతలోనే ఈ స్టోరీ మహేష్ బాబుకు బాగా నచ్చడం.. ఆ వెంటనే సెట్స్‌పైకి వెళ్లడం జరిగిందట.