Mazaka Teaser: మన్మథుడు హీరోయిన్ పై డైరెక్టర్ అనుచిత వ్యాఖ్యలు.. ఫ్యాన్స్ ఫైర్..

|

Jan 13, 2025 | 8:00 AM

ఒకప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది అన్షు అంబానీ. ప్రభాస్, నాగార్జున వంటి టాప్ హీరోలతో నటించే అవకాశాలను అందుకుంది. మన్మథుడు సినిమాతో ఈ అమ్మడు క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దాదాపు 22 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తుంది. తాజాగా మజాకా చిత్రంలో నటిస్తుంది.

Mazaka Teaser: మన్మథుడు హీరోయిన్ పై డైరెక్టర్ అనుచిత వ్యాఖ్యలు.. ఫ్యాన్స్ ఫైర్..
Trinadha Rao, Anshu Ambani
Follow us on

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ మజాకా. డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కొద్దిరోజులుగా వేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన రీతూ వర్మ కథానాయికగా నటిస్తుంది. అలాగే ఇందులో సీనియర్ నటుడు రావు రమేశ్ కీలకపాత్రలో నటిస్తుండగా.. అతడి జోడిగా ఒకప్పటి హీరోయిన్ అన్షు అంబానీ నటిస్తుంది. మజాకా సినిమాతోనే తెలుగు సినీ పరిశ్రమలోకి రీఎంట్రీ ఇస్తుంది. ఆదివారం (జనవరి 12న) ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ తోపాటు, టీజర్ లాంచ్ ఈవెంట్ సైతం నిర్వహించింది చిత్రయూనిట్. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయియి. అయితే ఈ వేడుకలో డైరెక్టర్ త్రినాథరావు నక్కిన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

మజాకా మూవీ టీజర్ లాంచ్ వేడుకలో డైరెక్టర్ త్రినాథ రావు మాట్లాడుతూ.. “అన్షు లాంటి హీరోయిన్.. ఎప్పుడో మేము యంగ్ స్టర్ గా ఉన్నప్పుడో ఇంకా చిన్నప్పుడో నాకు గుర్తులేదు. మన్మథుడు సినిమా చూసి ఏందిరా ఈ అమ్మాయి లడ్డాలా ఉంది అనుకునేవాడిని అప్పుడు . ఆ అమ్మాయిని చూసేందుకే మన్మథుడు సినిమాకు వెళ్లిపోయేవాళ్లం. ఓ రేంజ్ లో ఉండేదయ్యా బాబూ. ఇప్పటికీ అలాగే ఉందా.. ? కొంచం సన్నబడింది” అంటూ హీరోయిన్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియోస్ ఇఫ్పుడు నెట్టింట వైరలవుతుండగా.. డైరెక్టర్ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. డైరెక్టర్ మాటలపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఒక హీరోయిన్ గురించి డైరెక్టర్ అలా మాట్లాడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..