Mishan Impossible : నిజాయితీగా కథ చెబితే ప్రేక్షకులు చూస్తారనే నమ్మకం ఉంది: స్వరూప్ ఆర్.ఎస్.జె
ఏ కథ రాసినా కామెడీ, థ్రిల్లర్, డ్రామా వుండేలా చూసుకుంటాను అంటున్నారు యంగ్ దర్శకుడు స్వరూప్ ఆర్.ఎస్.జె. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో ఒక్కసారిగా ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్నాడు
Mishan Impossible : ఏ కథ రాసినా కామెడీ, థ్రిల్లర్, డ్రామా వుండేలా చూసుకుంటాను అంటున్నారు యంగ్ దర్శకుడు స్వరూప్ ఆర్.ఎస్.జె. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో ఒక్కసారిగా ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. తాజాగా ఆయన తెరకెక్కిస్తున్న సినిమా మిషన్ ఇంపాజిబుల్. తాప్సీ పన్ను(Taapsee Pannu)ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సినిమాను నిర్మించారు. ముగ్గురు పిల్లలుగా రోషన్, బానుప్రకాష్, జైతీర్థ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు స్వరూప్ ఆర్.ఎస్.జె మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. తెలుగులో `చంటబ్బాయ్` తర్వాత డిటెక్టివ్ సినిమాలు పెద్దగా రాలేదు. లిటిల్ సోల్జర్స్ తర్వాత పిల్లలతో సినిమా రాలేదు. అందుకే వాటికి తగ్గట్టుగా రాసుకుని తీసిన సినిమానే `మిషన్ ఇంపాజిబుల్ అని స్వరూప్ ఆర్.ఎస్.జె. తెలియజేశారు.
మిషన్ ఇంపాజిబుల్ అనే కథ 2014లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రాసుకున్నానని. దావూద్ ఇబ్రహం అనే వ్యక్తిని పట్టుకుంటే డబ్బులు ఇస్తామని పేపర్ లో వచ్చిన ప్రకటన చూసిన పాట్నాకు చెందిన ముగ్గురు పిల్లలు ముంబై వెళ్ళిపోతారు. ఈ వార్తను కథగా రాసుకున్నాను. కానీ ఆ తర్వాత ఏజెంట్.. కథ డెవలప్ అవ్వడంతో ముందుగా దాన్ని ప్రారంభించా అని తెలిపారు. రెండవ సినిమా ఇలాంటి కథతో రావడం రిస్క్ అనుకోలేదు. నిజాయితీ గా కథ చెబితే ప్రేక్షకులు చూస్తారనే పూర్తి నమ్మకం నాకుంది. ఏజెంట్.. సినిమాతో అది నిజమైంది. నా స్నేహితులు కూడా మొదటి సినిమా లవ్, కామెడీ చేయమన్నారు. కానీ నా తరహాలో నిజాయితీగా చెబితే చూస్తారనే డిటెక్టివ్ సినిమా తీశా అన్నారు. అలాగే మిషన్ ఇంపాజిబుల్ సినిమాలో మొదట ఎవరైనా హీరోతో చేద్దామనుకున్నాం. కానీ అప్పటికే `ఏజెంట్..` సినిమా చేశాం కదా అని ఫిమేల్ పాత్ర పెట్టాం. తాప్సీ చేసిన `తప్పడ్`, `పింక్` సినిమాలు స్ట్రాంగ్ మహిళా పాత్రలు పోషించింది. అందులోనూ తెలుగులో తను నటించి చాలా కాలం అయింది. ఆమెకు కథ చెప్పాను. తన కేరెక్టర్ చిన్నదైనా కథ నచ్చిందని సినిమా చేయడానికి ఒప్పుకుంది. తను ప్రొఫిషనల్ యాక్టర్. ముందురోజే డైలాగ్‌లు తీసుకుని ప్రిపేర్ అయ్యేది. ఆరు గంటల కల్లా సెట్ కి వచ్చేసేది అని అన్నారు. ఈ కథ అనుకున్నప్పుడే థ్రిల్లర్ అనుకున్నాం. ముగ్గురు పిల్లలు (రోషన్, బానుప్రకాష్, జైతీర్థ) దావూద్‌ను పట్టుకోవడం అనేది కామెడీగా అనిపించి చేశాం. ఇందులో 60 శాతం కామెడీ వుంటుంది. మిగిలింది థ్రిల్లర్. వేసవిలో సమ్మర్ హాలిడేస్, ఉగాది పండుగ, సింగిల్ రిలీజ్ కాబట్టి పెద్ద సినిమాలున్నా చిన్న సినిమా కూడా విడులచేస్తే వర్కవుట్ అవుతుందని భావించి రిలీజ్ చేస్తున్నాం. కథ బాగుంటే ప్రేక్షకులు చూస్తారనే నమ్మకం మాకుంది అని చెప్పుకొచ్చారు.
మరిన్ని ఇక్కడ చదవండి :