Naga Shaurya : కుర్ర హీరో సినిమా నుంచి క్రేజీ అప్డేట్.. కృష్ణ వ్రిందా విహారి టీజర్ వచ్చేది అప్పుడే..

కుర్ర హీరో నాగశౌర్య ఇటీవల వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. హిట్లు ప్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సినిమాలు చేస్తున్నాడు.

Naga Shaurya : కుర్ర హీరో సినిమా నుంచి క్రేజీ అప్డేట్.. కృష్ణ వ్రిందా విహారి టీజర్ వచ్చేది అప్పుడే..
Krishnaravinda Vihari
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 27, 2022 | 8:02 AM

Naga Shaurya : కుర్ర హీరో నాగశౌర్య ఇటీవల వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. హిట్లు ప్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే లక్ష్య , వరుడు కావలెను సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు. నాగ శౌర్య నటిస్తున్న తాజా సినిమా కృష్ణ వ్రిందా విహారి. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోంది ఈ మూవీ. ఈ సినిమాలో విభిన్నమైన పాత్రలో నటించనున్నాడు శౌర్య.  నాగశౌర్య తొలిసారి ఈ సినిమాలోబ్రాహ్మణ యువకుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పార్ట్ ఇటీవలే పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన  ఈ సినిమా ఫస్ట్లుక్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా  చిత్ర యూనిట్ ఈ సినిమా టీజర్ సంబంధించిన అప్డేట్ తో ముందుకు వచ్చింది. కృష్ణ వ్రిందా విహారి టీజర్ మార్చి 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఆకట్టుకునే పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో నాగ శౌర్య, షిర్లీ సెటియా రొమాంటిక్ పోజ్లో కనిపించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో అలనాటి నటి రాధిక శరత్ కుమార్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ స్వరాలు అందించారు. కృష్ణ వ్రిందా విహారి వేసవి సినిమాను కానుకగా ఏప్రిల్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ  ఇతర పాత్రలో కనిపించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shahrukh Khan: 56 ఏళ్ల వయసులో 8 ప్యాక్స్‌.. ‘పఠాన్’ లుక్స్‌కి అభిమానులు ఫిదా..!

RRR Movie: ఆర్ఆర్ఆర్‏కు అక్కడ నిరాశేనా.. ముఖం చాటేస్తోన్న ప్రేక్షకులు.. ఎందుకంటే..

Sai Dharam Tej: యాక్సిడెంట్‌ తర్వాత సాయిధరమ్‌ తేజ్‌ మొదటి వీడియో.. ఆరోజు గుడ్‌న్యూస్‌ చెబుతానంటూ..