AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’ సినిమాకు ఆదా ఫస్ట్ ఛాయిస్ కాదు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..

గతేడాది మే 5న విడుదలైన ఈ మూవీ పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇక ఇందులో ప్రధాన పాత్రలో నటించింది హీరోయిన్ ఆదా శర్మ.. ఈ మూవీతో ఆమె క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. విడుదలైన చాలా కాలం తర్వాత ఓటీటీలోకి వచ్చింది ఈ మూవీ. ప్రస్తుతం జీ5లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళీ భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది. కేరళలో కొన్నేళ్లుగా 32 వేల మంది మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలు.. వారికి ఆచూకీ ఎక్కడనే నేపథ్యంతో ఈ మూవీని తెరకెక్కించారు.

The Kerala Story: 'ది కేరళ స్టోరీ' సినిమాకు ఆదా ఫస్ట్ ఛాయిస్ కాదు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..
The Kerala Story Movie
Rajitha Chanti
|

Updated on: Mar 05, 2024 | 6:11 PM

Share

విడుదలకు ముందే వివాదాస్పదమైన సినిమా ‘ది కేరళ స్టోరీ’. డైరెక్టర్ సుదీప్తో సేన్ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ అయ్యింది. విమర్శలతోపాటు ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా.. ఈ మూవీ రాజకీయంగానూ ఎన్నో ప్రకంపనలు సృష్టించింది. గతేడాది మే 5న విడుదలైన ఈ మూవీ పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇక ఇందులో ప్రధాన పాత్రలో నటించింది హీరోయిన్ ఆదా శర్మ.. ఈ మూవీతో ఆమె క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. విడుదలైన చాలా కాలం తర్వాత ఓటీటీలోకి వచ్చింది ఈ మూవీ. ప్రస్తుతం జీ5లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళీ భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది. కేరళలో కొన్నేళ్లుగా 32 వేల మంది మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలు.. వారికి ఆచూకీ ఎక్కడనే నేపథ్యంతో ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో షాలిని ఉన్నికృష్ణన్ అనే అమ్మాయిగా కనిపించి మరోసారి తన నటనతో ప్రశంసలు అందుకుంది ఆదా శర్మ. కానీ ఈ సినిమాకు ఆమె ఫస్ట్ ఛాయిస్ కాదన్నారు డైరెక్టర్ సుదీప్తో సేన్.

డైరెక్టర్ సుదీప్తోసేన్ తెరకెక్కిస్తోన్న కొత్త సినిమా బస్తర్. ఇందులో ఆదా శర్మ కథానాయికగా నటిస్తుంది. ఈ మూవీలో ఐపీఎస్ అధికారిణి నీర్జా మాధవన్ పాత్రలో ఆదా కనిపించనుంది. ఈ క్రమంలో ఇటీవల టీవీ9 భారత్ వర్ష్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ సుదీప్తోసేన్ మాట్లాడుతూ.. ది కేరళ స్టోరీ మూవీకి ఆదా ఫస్ట్ ఛాయిస్ కాదన్నారు. అందుకు మరో హీరోయిన్ ను అనుకున్నారట.

“ది కేరళ స్టోరీ సినిమాకు ఆదా ఫస్ట్ ఛాయిస్ కాదు.. ఎందుకంటే షాలినీ ఉన్నికృష్ణన్ది మలయాళ పాత్ర. ఈ పాత్రకు మలయాళ నటి లేదా తమిళ నటి ఎవరైనా నటిస్తారని, లేదంటే సౌత్ నటి ఎవరైనా ఉండాలని అనుకున్నాం. కానీ మేం అనుకున్నంత నటి దొరకలేదు. చాలా మంది నటీమణులు అభద్రతా భావంతో ఉన్నారు. కాస్టింగ్ చాలా కష్టంగా మారింది. ఈ క‌థ‌ని అదాకు చెప్ప‌గానే అదా ‘అవును’ అని చెప్ప‌డానికి పెద్ద‌గా టైమ్ తీసుకోలేదు. ఇక షాలిని ఉన్నికృష్ణన్ క్యారెక్టర్‌తో అదా భారతదేశంలోని అత్యుత్తమ నటీమణులలో ఒకరని నిరూపించుకుంది. ఈ రోజు ఆమె ప్రతి ఇంటి కూతురిగా మారింది. అందుకే ‘బస్తర్’లో అతడి ఎంపిక ముందే ఖరారైంది.” అంటూ చెప్పుకొచ్చాడు.

View this post on Instagram

A post shared by Adah Sharma (@adah_ki_adah)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.