Charmy Kaur: అలాంటి వాళ్లను అలాగే వదిలేయాలి.. వైరలవుతున్న ఛార్మీ ఇన్ స్టా పోస్ట్..
నిత్యం ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది ఛార్మీ. ఇటీవల కొన్ని రోజుల క్రితం ఎమోషనల్ పోస్టులు పెట్టింది ఛార్మీ. కానీ ఇప్పుడు ఆమె షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట చర్చనీయాంశమైంది. ఎప్పుడూ సరదాగా ఫోటోస్, మూవీ అప్డేట్స్ షేర్ చేసే ఛార్మీ ఇప్పుడు నెగిటివ్ మనషులు... వారి ఆలోచనలు అంటూ ఆసక్తికర పోస్ట్స్ చేసింది. దీంతో ఇప్పుడు ఆమె చేసిన పోస్టుల స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఒకప్పుడు వరుస సినిమాలో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్ ఛార్మీ కౌర్. కానీ ఇప్పుడు నిర్మాతగా రాణిస్తోంది. చివరిసారిగా జ్యోతిలక్ష్మి సినిమాలో కనిపించిన ఆమె.. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ 2 సినిమా నిర్మాణ పనుల్లో బిజీగా ఉంది. డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి పూరి కనెక్ట్స్ ప్రొడక్షన్ హౌస్ బాధ్యతలు చూసుకుంటుంది. అటు సినిమాలు నిర్మిస్తూనే ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది ఛార్మీ. ఇటీవల కొన్ని రోజుల క్రితం ఎమోషనల్ పోస్టులు పెట్టింది ఛార్మీ. కానీ ఇప్పుడు ఆమె షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట చర్చనీయాంశమైంది. ఎప్పుడూ సరదాగా ఫోటోస్, మూవీ అప్డేట్స్ షేర్ చేసే ఛార్మీ ఇప్పుడు నెగిటివ్ మనషులు… వారి ఆలోచనలు అంటూ ఆసక్తికర పోస్ట్స్ చేసింది. దీంతో ఇప్పుడు ఆమె చేసిన పోస్టుల స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. అసలు ఛార్మీకి ఏం జరిగింది ?.. ఎవరైనా ఏమైనా అన్నారా ?..ఎవరికి పరోక్షంగా కౌంటరిచ్చింది ? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.
“నెగిటివ్ ఆలోచనలు కలిగిన మనుషులను ఆలాగే వదిలేయ్యాలి. అలాంటి నెగిటివ్ మైండ్‌తో.. అవే ఆలోచనలతో జీవిస్తారు. కానీ నాకు మాత్రం కచ్చితంగా ఫోకస్ పెట్టడానికి చాలా పనులు ఉన్నాయ్ ” అంటూ తన ఇన్ స్టారీలో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

Charmy
ఛార్మీ.. నీతోడు కావాలి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. కేవలం 14 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తమిళంలో వరుసగా అవకాశాలు అందుకుంది. కానీ అప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. చాలా కాలం గ్యాప్ తర్వాత శ్రీ ఆంజనేయం సినిమాతో మరోసారి తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ఛార్మీకి వరుస ఆఫర్స్ వచ్చాయి. మంత్ర, చక్రం, మాస్, గౌరి, అనుకోకుండా ఒక రోజు, అల్లరి పిడుగు, చుక్కల్లో చంద్రుడు, లక్ష్మీ చిత్రాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఛార్మీ క్రేజ్ మారిపోయింది. కానీ ఆ తర్వాత ఈ బ్యూటీ నటించిన చిత్రాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. తర్వాత మెల్లగా సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం డైరెక్టర్ పూరితో కలిసి నిర్మాతగా సినిమాలను నిర్మిస్తుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




