AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: పవన్ సినిమాకు విజయ్ దేవరకొండ సినిమాకు మధ్య ఉన్న పోలిక అదేనట

పవన్‌ కల్యాణ్‌ కెరీర్‌ బెస్ట్ మూవీస్‌ లిస్టు రెడీ చేయమంటే వితౌట్‌ ఖుషీ సాధ్యం కాదేమో. యంగ్‌స్టర్స్ ని మాత్రమే కాదు, ఫ్యామిలీస్‌కి కూడా ఆ రేంజ్‌లో కనెక్ట్ అయిన సినిమా

Pawan Kalyan: పవన్ సినిమాకు విజయ్ దేవరకొండ సినిమాకు మధ్య ఉన్న పోలిక అదేనట
Kushi
Rajeev Rayala
|

Updated on: Apr 14, 2023 | 8:40 AM

Share

కొన్ని సినిమాల పేర్లు వింటుంటేనే ఓ తెలియని వైబ్రేషన్‌ ఉంటుంది. అలాంటి వైబ్రేషన్స్ తెచ్చే మూవీ నేమ్స్ లో ఖుషి ఒకటి. అందుకే ఆ టైటిల్‌ని విజయ్‌ దేవరకొండ సినిమాకు సెలక్ట్ చేశామని అంటున్నారు డైరక్టర్‌ శివ నిర్వాణ. అంతే కాదు, పవన్‌ కల్యాణ్‌ సినిమాతో, రౌడీ బోయ్‌ సినిమాకు ఓ అద్భుతమైన పోలిక కూడా చెప్పేశారు ఇంతకీ ఏంటది? పవన్‌ కల్యాణ్‌ కెరీర్‌ బెస్ట్ మూవీస్‌ లిస్టు రెడీ చేయమంటే వితౌట్‌ ఖుషీ సాధ్యం కాదేమో. యంగ్‌స్టర్స్ ని మాత్రమే కాదు, ఫ్యామిలీస్‌కి కూడా ఆ రేంజ్‌లో కనెక్ట్ అయిన సినిమా. బ్లాక్‌ బస్టర్‌ సాంగ్స్, కడుపుబ్బ నవ్వించే సీన్స్, కన్విన్సింగ్‌గా అనిపించే ఎలిమెంట్స్ ఈ సినిమాను మరో రేంజ్‌లో నిలిపేశాయి. ఆ ఖుషి సినిమాకు తాను పెద్ద ఫ్యాన్‌ని అని చెప్పేశారు డైరక్టర్‌ శివ నిర్వాణ.

ఇప్పుడు విజయ్‌ దేవరకొండ హీరోగా, సమంత హీరోయిన్‌గా తెరకెక్కుతోంది ఖుషి సినిమా. పవన్‌ కల్యాణ్‌ సినిమాలో ఎలాంటి భావోద్వేగాలు ఉంటాయో, ఎలాంటి ఫీల్‌ క్రియేట్‌ అయిందో, అచ్చం అలాంటి ఫీల్‌ ఇప్పుడు విజయ్‌ – సమంత మూవీని చూసినా కలిగి తీరుతుందట. విజయ్‌ దేవరకొండ నటిస్తున్న ఈ లేటెస్ట్ మూవీకి ఎన్నో పేర్లు అనుకున్నారట. అయితే ఎన్ని రకాలుగా ఆలోచించినా ఖుషి పర్ఫెక్ట్ టైటిల్‌ అనిపించిందట శివ నిర్వాణకు.

అప్పటివారు ఈ ఖుషీని చూస్తే ఆ రోజుల్ని గుర్తుచేసుకుంటారు. ఇప్పటివారు చాలా ఫ్రెష్‌గా ఫీలవుతారు. ఆ టైటిల్‌కి తగ్గ న్యాయం చేస్తున్నామని అంటున్నారు డైరక్టర్. ఇటీవల ఖుషి కేరళ షెడ్యూల్‌ కంప్లీట్‌ అయింది. విజయ్‌ – సమంత ఈ షెడ్యూల్లో పాల్గొన్నారు. షూటింగ్‌ కూడా దాదాపుగా పూర్తి కావచ్చింది.

ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు