RC15 : చరణ్, శంకర్ సినిమా స్టోరీ ఇదేనా..? ఫిలిం సర్కిల్స్‌లో ఆసక్తికర చర్చ
రామ్ చరణ్ సినిమా కోసం ఇప్పుడు దేశం మొత్తం ఎదురుచూస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు చరణ్.

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ ఏవైటెడ్ మూవీ ఏదైనా ఉంది అంటే అది చరణ్ , శంకర్ మూవీనే. రామ్ చరణ్ సినిమా కోసం ఇప్పుడు దేశం మొత్తం ఎదురుచూస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు చరణ్. జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరిగా నటించి మెప్పించాడు చరణ్. ఈ సినిమాలో చరణ్ నటన, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను ఫిదా చేసింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు మన మెగా పవర్ స్టార్. టాప్ డైరెక్టర్ గా పేరున్న శంకర్ ఓ పవర్ ఫుల్ కథతో రామ్ చరణ్ తో సినిమా తెరకెక్కిస్తున్నారు. చరణ్ కెరీర్ లో ఇది 15వ మూవీ. ఈ సినిమాలో చరణ్ కు జోడీగా బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ మూవీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందని. చరణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడని టాక్.
ఓ పాత్రలో ముఖ్యమంత్రిగా.. మరో పాత్రలో ఐఏఎస్ ఆఫీసర్‌గా చెర్రీ ఆకట్టుకోనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో చరణ్ స్వాంత్య్ర సమరంలో పోరాడిన యోధుల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తితో స్వాంత్య్ర సమరంలో పాలు పంచుకున్న ఓ వ్యక్తి జీవిత కథ ఆధారంగా ఈ మూవీని శంకర్ తెరకెక్కిస్తున్నాడట.
ఇప్పుడు ఇదే టాపిక్ ఫిలిం నగర్ లో జోరుగా వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో సునీల్, శ్రీకాంత్, అంజలి కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ తో సినిమా దాదాపుగా 70 శాతం వరకు పూర్తయిందని తెలుస్తోంది.




