Life Is Beautifull: తస్సాదియ్యా.. ఏం ఛేంజ్ గురూ.. ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ హీరోయిన్ అంటే అస్సలు గుర్తుపట్టలేం..

ఇందులో అభిజిత్, సుధాకర్ కోమాకుల, నవీన్ పోలిశెట్టి, విజయ్ దేవరకొండ, శ్రీవిష్ణు కీలకపాత్రలు పోషించారు. అప్పట్లో ఈ చిత్రంలో వీరిని గుర్తుపట్టం కూడా కష్టమే. అలాగే సీనియర్ హీరోయిన్స్ అమల, అంజలా జవెరీ, శ్రియ కూడా ముఖ్య పాత్రలు పోషించారు. అలాగే ఈషా రెబ్బ, చాందినీ చౌదరీ, రష్మీ శాస్త్రి, జరా షా, షగున్ కౌర్ వంటి కొత్త తారలు వెండితెరకు పరిచయమయ్యారు.

Life Is Beautifull: తస్సాదియ్యా.. ఏం ఛేంజ్ గురూ.. 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' హీరోయిన్ అంటే అస్సలు గుర్తుపట్టలేం..
Life Is Beautifull
Follow us

|

Updated on: Sep 13, 2024 | 7:49 PM

తెలుగు సినీ ప్రియుల మదిలో ఎప్పటికీ నిలిచిపోయే అందమైన చిత్రాల్లో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన అద్భుతమైన చిత్రాల్లో ఇది ఒకటి. యూత్ ఫుల్ కథలను మరింత అందంగా.. సహజంగా అడియన్స్ ముందుకు తీసుకువస్తుంటారు. ఆయన చిత్రాల్లో యువ నటీనటులు ఎక్కువగా కనిపిస్తుంటారు. హ్యాపీ డేస్ సినిమా తర్వాత ఆ స్థాయిలో యూత్ కు తెగ నచ్చేసిన సినిమా లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్. ఇందులో అభిజిత్, సుధాకర్ కోమాకుల, నవీన్ పోలిశెట్టి, విజయ్ దేవరకొండ, శ్రీవిష్ణు కీలకపాత్రలు పోషించారు. అప్పట్లో ఈ చిత్రంలో వీరిని గుర్తుపట్టం కూడా కష్టమే. అలాగే సీనియర్ హీరోయిన్స్ అమల, అంజలా జవెరీ, శ్రియ కూడా ముఖ్య పాత్రలు పోషించారు. అలాగే ఈషా రెబ్బ, చాందినీ చౌదరీ, రష్మీ శాస్త్రి, జరా షా, షగున్ కౌర్ వంటి కొత్త తారలు వెండితెరకు పరిచయమయ్యారు.

ఈ సినిమాలో సుధాకర్ కోమాకుల సరసన నటించి కుర్రకారు క్రష్ గా మారింది జరా షా. ఇందులో లక్ష్మీ పాత్రలో లంగావోణీ అచ్చమైన తెలుగమ్మాయిగా కనిపించింది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన జరా షా.. ఈ సినిమాతో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. కానీ ఈ మూవీ తర్వాత అంతగా హిట్స్ అందుకోలేకపోయింది. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించినప్పటికీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు. నాగార్జున భాయ్, పెరేట్స్ 1.0, అనుష్క రుద్రమదేవీ, ఐతే 2.0 చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. ఇక ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది.

నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన జరా షా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యింది. ఒకప్పుడు కాస్త బొద్దుగా. ఎంతో అందంగా కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఒకప్పుడు ట్రెడిషనల్ బ్యూటీ.. ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచేసి నెట్టింట రచ్చ చేస్తుంది. ప్రస్తుతం ఇన్ స్టాలో వరుస ఫోటోషూట్స్ షేర్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ఒకప్పుడు లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ హీరోయిన్ ఇంతగా మారిపోయిందేంటీ అంటూ షాకవుతున్నారు.

View this post on Instagram

A post shared by Zara Shah (@iamzarashah)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.