AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Michael: మా సినిమాకు పాన్ ఇండియా పాపులారిటీ వున్న ఒక స్టార్ కావాలి.. అందుకే ఆయన్ను తీసుకున్నాం

సందీప్ కిషన్ మునుపెన్నడూ చూడని యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘’మైఖేల్’. సందీప్ కిషన్ తొలి పాన్ ఇండియా చిత్రమైన ’మైఖేల్’కి రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు.

Michael: మా సినిమాకు పాన్ ఇండియా పాపులారిటీ వున్న ఒక స్టార్ కావాలి.. అందుకే ఆయన్ను తీసుకున్నాం
Director Ranjit Jeyakodi
Rajeev Rayala
|

Updated on: Jan 28, 2023 | 7:04 AM

Share

హీరో సందీప్ కిషన్ మునుపెన్నడూ చూడని యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘’మైఖేల్’. సందీప్ కిషన్ తొలి పాన్ ఇండియా చిత్రమైన ’మైఖేల్’కి రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్, దివ్యాంశ కౌశిక్, వరుణ్ సందేశ్, గౌతమ్ మీనన్, కీలక పాత్రలు పోషిస్తున్నారు. కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ ఎల్‌ పి, మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ‌ఎల్‌ పి కలిసి ఈ చిత్రాన్ని భారీ నిర్మిస్తున్నాయి. భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పకులు. ఇప్పటికే విడుదలైన మైఖేల్ టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మైఖేల్ ఫిబ్రవరి3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానున్న నేపధ్యంలో దర్శకుడు రంజిత్ జయకోడి చిత్ర విశేషాలని పంచుకున్నారు.

ఆయన మాట్లాడుతూ.. మాది చెన్నై. దర్శకుడిగా మూడు సినిమాలు చేశాను. నా తొలి చిత్రం విజయ్ సేతుపతి గారితో చేశాను. తర్వాత హరీష్ కళ్యాణ్ తో మరో సినిమా చేశాను. మూడో సినిమా కూడా విడుదలకు సిద్ధమౌతుంది. ‘మైఖేల్’ నా నాలుగో చిత్రం. అంతకుముందు దర్శకుడు రామ్ దగ్గర సహాయకుడిగా పని చేశాను. ఒక సినిమాకి పని చేసిన తర్వాత దర్శకుడిగా నా ప్రయాణం మొదలుపెట్టాను.

నా రెండో సినిమా చూసి సందీప్ కిషన్ కాల్ చేశారు. నా వర్క్ ఆయనకి చాలా నచ్చింది. అలా మేము మంచి స్నేహితులయ్యాం. లాక్ డౌన్ చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. సెకండ్ లాక్ డౌన్ సమయంలో ‘’మనం కలసి ఒక సినిమా చేద్దాం’’ అన్నారు. ఆయనకి అప్పటికి ఒక యాక్షన్ సినిమా చేయాలని వుంది. సరిగ్గా నేను కూడా ఆ సమయానికి యాక్షన్ స్క్రిప్ట్ రాస్తున్నాను. అలా ‘మైఖేల్’ మొదలైయింది. ’మైఖేల్’ మూవీ ఒక జోనర్ అని చెప్పలేం. రొమాంటిక్, యాక్షన్, గ్యాంగ్ స్టార్ డ్రామా, పిరియడ్ ఫిల్మ్ అనొచ్చు. ఇందులో 70, 80, 90 ఇలా మూడు కాలాలు వుంటాయి. ఎక్కువ భాగం 90లో వుంటుంది. కథ చాలా ఆసక్తికరంగా వుంటుంది. గ్యాంగ్ స్టార్ డ్రామా వున్న బ్యూటీఫుల్ రొమాంటిక్ లవ్ స్టొరీ ఇది.

విజయ్ సేతుపతి నాకు మంచి స్నేహితుడు. నా మొదటి సినిమా ఆయనతోనే చేశాను. ఈ కథ కి పాన్ ఇండియా పాపులారిటీ వున్న ఒక స్టార్ కావాలి. నాకు తెలిసిన వారిలో విజయ్ సేతుపతి వున్నారు. ఈ పాత్ర గురించి చెప్పినపుడు ఆయనకి చాలా నచ్చింది. ఇందులో ఆయన పాత్ర చాలా సర్ ప్రైజింగా వుంటుంది. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు అని తెలిపారు.