చేతిలో రూపాయి లేదు.. ఆ యాంకర్ తాళిబొట్టు కొనిచ్చింది..! పూరి పెళ్లి చేసింది ఆమెనట

మాస్ మాహారాజా రవితేజ్ కెరీర్ ను ఇడియట్ సినిమాతో టర్న్ చేశారు. అలాగే పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ కు బద్రి, మహేష్ బాబుకు పోకిరి.. ప్రభాస్ కు బుజ్జిగాడు.. వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించారు. ఇక తన సినిమాల్లోని డైలాగ్స్.. హీరో మేనరిజం మాస్ లెవల్.

చేతిలో రూపాయి లేదు.. ఆ యాంకర్ తాళిబొట్టు కొనిచ్చింది..! పూరి పెళ్లి చేసింది ఆమెనట
Puri Jagannadh

Edited By:

Updated on: Jan 30, 2026 | 4:38 PM

తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైనమిక్ డైరెక్టర్ అంటే టక్కున చెప్పే పేరు పూరి జగన్నాథ్. ఆయన సినిమాలకు ఉన్నక్రేజ్ గురించి తెలిసిందే. హీరోలతో సంబంధం లేకుండా కేవలం ఆయన సినిమాల కోసం ఎదురుచూస్తే అభిమానులున్నారు. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా ఆయన సినిమాలు ప్రేక్షకులను అలరిస్తాయి. పూరి హీరోలను కొత్తగా రఫ్ లుక్ లో చూపించే విధానం ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంటుంది. ఎలాంటి కథనైనా.. తన స్టైల్లో యూత్‏కు కనెక్ట్ అయ్యేలా చూపించడంలో పూరి స్పెషల్. అలాగే ఆయన దర్శకత్వంలో నటించిన ప్రతి హీరోకు మాస్ ఇమేజ్ రావడం పక్కా అని బాక్సాఫీస్ ఫిక్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ ఫిక్స్ అయిపొయింది.  ఎంతో మంది స్టార్ హీరోలకు బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ఇండస్ట్రీలో వరుసగా భారీ విజయాలను అందుకున్న ఈ స్టార్ డైరెక్టర్స్.. అప్పట్లో కొందరిని నమ్మి ఆస్తులన్ని పోగొట్టుకున్నారు. ఈ సమయంలోనే వరుస ప్లాపులతో నెట్టుకోస్తున్నారు.

అన్నం బదులు అందం తింటుందా..!! సీరియల్‌లో సైడ్ యాక్టర్.. కానీ సినిమా హీరోయిన్లు కూడా పనికిరారు..

రీసెంట్ డేస్ లో పూరి హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది అప్పుడెప్పుడో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మరోసారి సంచలనం సృష్టించిన ఆయన.. ఆతర్వాత వరుసగా ఫ్లాప్స్ అందుకున్నారు. ఇక ఇప్పుడు విజయ్ సేతుపతితో స్లామ్ డాగ్ అనే సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా పూరి జగన్నాథ్ పెళ్లికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. పూరి జగన్నాథ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో లావణ్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం.

గోడకేసి కొట్టి, కటింగ్ ప్లేయర్‌తో మంగళసూత్రం తెంచాడు.. సింగర్ కౌసల్య జీవితంలో ఇంత విషాదమా..

అయితే పూరి పెళ్లి చేసుకున్న సమయంలో తన చేతిలో చిల్లి గవ్వలేదట. తనది ప్రేమ వివాహం కావడంతో.. సీక్రెట్ గా గుడిలో చేసుకున్నారట. అప్పుడు తాళిబొట్టు కొనడానికి కూడా డబ్బులు లేకపోవడంతో.. ఆ టైములో యాంకర్ ఝాన్నీ తాళిబొట్టు కొనిపెట్టారట. ఇక హేమ.. కూడా పెళ్లి బట్టలు పెట్టిందట. మిగిలిన స్నేహితులు కూల్ డ్రింక్స్ వంటివి స్పాన్సర్ చేశారని చెప్పారు పూరి. తను ఇండస్ట్రీలో పనిచేయడం స్టార్ట్ చేశాక.. బాగా సంపాదించానని.. కానీ కొందరిని నమ్మి డబ్బు పోగొట్టుకున్నాని.. తన పెళ్లికి సాయం చేసిన ఝాన్సీ, హేమ అలాగే.. తన స్నేహితులను ఎప్పటికీ మర్చిపోలేనని గతంలో పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

చూడటానికి పెద్ద అంకుల్.. కానీ నాతో అలా చేశాడు.. షాకింగ్ విషయం చెప్పిన యాంకర్

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..