Puri Musings: ‘మీది ఇలాంటి ప్రేమ అయితే దయచేసి ప్రేమించకండి.. అలా చేస్తే బంధం ముక్కలవుతుంది’.. పూరి జగన్నాథ్..

నాది అనుకోని అధికారం చెలాయించే ప్రేమ అయితే దయచేసి ప్రేమించకండి అంటూ పూరి మ్యూజింగ్స్ ద్వారా మరో ఫిలాసఫిని చెప్పుకొచ్చారు. కొద్ది రోజులుగా పూరి మ్యూజింగ్స్ ద్వారా విభిన్న అంశాల గురించి వివరణ ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా డోంట్ ఓన్ అనే విషయంపై తన స్టైల్లో చెప్పుకొచ్చారు పూరి.

Puri Musings: మీది ఇలాంటి ప్రేమ అయితే దయచేసి ప్రేమించకండి.. అలా చేస్తే బంధం ముక్కలవుతుంది.. పూరి జగన్నాథ్..
Puri Musings

Updated on: Dec 26, 2022 | 7:27 PM

ప్రేమ పేరుతో మరొకరి స్వేచ్చను లాగేసుకుంటే బంధం ముక్కలవుతుందని అన్నారు డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ ఛాయిస్ మాత్రమే అని.. అవసరం మాత్రం కాదు. నాది అనుకోని అధికారం చెలాయించే ప్రేమ అయితే దయచేసి ప్రేమించకండి అంటూ పూరి మ్యూజింగ్స్ ద్వారా మరో ఫిలాసఫిని చెప్పుకొచ్చారు. కొద్ది రోజులుగా పూరి మ్యూజింగ్స్ ద్వారా విభిన్న అంశాల గురించి వివరణ ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా డోంట్ ఓన్ అనే విషయంపై తన స్టైల్లో చెప్పుకొచ్చారు పూరి.

“బుద్ధుడు సర్వసంగ పరిత్యాగి.. ఏదీ నాదని అనుకోవద్దని చెప్పాడు. ఆయన చెప్పాడని అన్నీ వినలేం కాద. బ్యాంక్ బ్యాలెన్స్, ఇల్లు, కారు ఉండాలనుకుంటుంది. దేనినైనా సొంతం చేసుకోండి. కానీ మనిషిని కాదు. ఈ వ్యకక్తి నా ఆస్తి అన్నట్లు ఎప్పుడూ ప్రవర్తించవద్దు. అలా అనుకోవడానికి మొదటి మెట్టు ప్రేమ. ప్రేమ పేరుతో ఓ వ్యక్తిని తాడేసి కట్టేస్తారు. దాంతో ఆ వ్యక్తికి ఊపిరాడదు. రాను రాను మీ ప్రేమ వాళ్లకు వేదింపుగా మారుతుంది. అవతలి మనిషి మనం చెప్పినట్టే వినాలి. రహస్యాలన్నీ మనతోనే పంచుకోవాలి అని అనుకుంటారు. మీది అలాంటి ప్రేమ అయితే దయచేసి ప్రేమించవద్దు. జీవితంలో ప్రేమనేది ఒక ఛాయిస్ మాత్రమే.. అంతేకానీ అవసరం కాదు.

ప్రేమ లేకపోయినా సంతోషంగా బతకొచ్చు. నువ్వు ఎవరినీ ప్రేమించకపోతే కొన్ని సమస్యలు తగ్గినట్టే. నీ ప్రేమ అవతలి వ్యక్తికి ఊపిరాడకుండా చేస్తే ఎలా ?. ఒక వ్యక్తి మరొకరికి భారం కాకుండదు. ఇద్దరి మధ్య మర్యాద ఉండాలి. గౌరవం, మర్యదలో స్వేచ్ఛ ఉంటుంది. మర్యాద ఇవ్వకపోతే రక్తసంబంధాలు, బంధాలు తెగిపోతాయి. నీ జీవితం గురించే నీకు తెలియదు.. నీ లైఫ్ లో జరిగే సంఘటనలు కూడా నీకు తెలియవు. మరీ పక్కవాళ్ల జీవితం గురించి నీకెలా తెలుస్తుంది. మనందరం భూమి మీదకు టూర్ కోసం వచ్చాం. టూరిస్ట్ లా ఉందాం. చూద్దాం. ఎంజాయ్ చేద్దాం. టూర్ పూర్తికాగానే వెళ్లిపోదాం. అంతేకానీ నీతోటి పర్యాటకుడిని సొంతం చేసుకోవాలని మాత్రం చూడొద్దు” అంటూ వివరణ ఇచ్చారు పూరి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.