Prashanth Neel : టీమ్ అలర్ట్ అయ్యింది.. ప్రశాంత్ నీల్ వార్నింగ్ వర్కౌట్ అయ్యేనా..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సలార్ సినిమా తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ప్రభాస్ పెద్దనాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజు కన్నుమూయడంతో ఈ సినిమాకు షూటింగ్ కు బ్రేక్ పడింది.

Prashanth Neel : టీమ్ అలర్ట్ అయ్యింది.. ప్రశాంత్ నీల్ వార్నింగ్ వర్కౌట్ అయ్యేనా..
Prashanth Neel
Follow us

|

Updated on: Oct 02, 2022 | 11:51 AM

కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియన్ సినిమాల డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సలార్ సినిమా తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ప్రభాస్ పెద్దనాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజు కన్నుమూయడంతో ఈ సినిమాకు షూటింగ్ కు బ్రేక్ పడింది. త్వరలోనే ప్రభాస్ ఆ బాధనుంచి బయటపడి షూటింగ్ మొదలు పెట్టనున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నారు. ప్రభాస్ తో తాను చేయబోయే న్యూ మూవీ షూట్లో ఓ కొత్త రూల్ ఒకటి పాస్ చేశారు. ఆ రూల్‌ను ఎవరూ అతిక్రమించినా.. షూట్‌ నుంచి.. బయటికి గెంటేస్తా అంటూ గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారని తెలుస్తోంది.

ఇప్పటికే చాలా కారణాలతో సలార్ షూటింగ్ డిలే అవుతుందని ఫీల్ అవుతున్న ప్రశాంత్‌ నీల్‌కు …. సెట్ నుంచి లీకవుతున్న ఫోటోలు.. వీడియోలు తెగ పరేషాన్ చేస్తున్నాయట. సినిమాపై ఉన్న క్యూరియాసిటీని పోయేలా చేస్తున్నాయట. దీంతో ఇటీవల తన టీం పై సీరియస్ అయిన ప్రశాంత్‌ నీల్.. సెట్‌ నుంచి ఎలాంటి ఫోటోలు.. వీడియోలు బయటికి వెళ్లద్దని వారికి వార్నింగ్ కూడా ఇచ్చారట.

అయినా.. ప్రభాస్ కు సంబంధించిన ఓ లేటెస్ట్ పిక్ ఒకటి ఇటీవలే నెట్టింట లీకై.. ట్రెండ్ అవడంతో.. ప్రశాంత్ నీల్ తాజాగా ఓ డెసీషన్ తీసుకున్నారట. సినిమా షూట్‌ కు ఎవరూ సెల్ ఫోన్లు తీసుకురావద్దు అంటూ ఆర్డర్ వేశారట. అంతే కాదు షూట్‌కు ముందు అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా.. లేవా అని ఒకటి రెండు సార్లు చెక్ చేయాలని తన పర్సనల్ టీంకు ఆర్డర్ వేశారట. త్వరలోనే షూటింగ్ తిరిగి ప్రారంభించనున్నారు. దాంతో ప్రశాంత్ టీమ్ అలర్ట్ అయ్యారు. అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఎలాంటి ఫోటో కానీ వీడియో కానీ బయటకు రాకుండా ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు