Hanu Man: హనుమాన్‌లో మెగాస్టార్ చిరంజీవి.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ

మహేష్ బాబు గుంటూరు కారం లాంటి బడా సినిమాకు పోటీగా జనవరి 12న విడుదల కానున్న హనుమాన్. సూపర్ హీరో కథతో దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోగా తేజ సజ్జ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా హనుమంతుడి బ్యాక్డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబినేషన్ లో గతంలో జంబిరెడ్డి సినిమా వచ్చిన విషయం తెలిసిందే.

Hanu Man: హనుమాన్‌లో మెగాస్టార్ చిరంజీవి.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ
Hanuman
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 30, 2023 | 6:04 PM

ఈసారి సంక్రాంతికి భారీ పోటీ ఉండనుంది. ఈ సంక్రాంతికి ఏకంగా ఐదు సినిమాలు పోటీపడనున్నాయి. ఈ పోటీలో హనుమాన్ సినిమా ఒకటి. మహేష్ బాబు గుంటూరు కారం లాంటి బడా సినిమాకు పోటీగా జనవరి 12న విడుదల కానున్న హనుమాన్. సూపర్ హీరో కథతో దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోగా తేజ సజ్జ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా హనుమంతుడి బ్యాక్డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబినేషన్ లో గతంలో జంబిరెడ్డి సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తుండటంతో ఈ సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే ఈ సినిమానుంచి పోస్టర్స్, టీజర్, ట్రైలర్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దాంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హనుమంతుడి పాత్ర చూపించారు. అయితే ఆ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది. చాలా మంది సోషల్ మీడియాలో మెగాస్టార్ హనుమంతుడిగా కనిపించనున్నారని కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాలో హనుమంతుడి పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. హనుమాన్ సినిమాలో హనుమంతుడిగా నటించింది చిరంజీవి గారా..? లేదా అన్నది ఇప్పుడు చెప్పలేను.. కానీ హనుమంతుడి పాత్రలో చిరంజీవి గారు నటిస్తూ బాగుంటుంది. మా సినిమాలో హనుమంతుడి పాత్రలో ఎవరు నటిస్తున్నారన్నది ఇప్పుడు చెప్పలేను సినిమాలోనే చూడాలి అని అన్నారు ప్రశాంత్ వర్మ. దాంతో మెగాస్టార్ చిరంజీవి హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారని కొంతమంది బలంగా నమ్ముతున్నారు. మరి హనుమాన్ సినిమాలో ఆంజనేయుడిగా ఎవరు నటిస్తున్నారన్నది చూడాలి.

తేజ సజ్జ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

తేజ సజ్జ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.