Nag Ashwin: కలి యుగంలో ఏం జరగబోతుంది.. కల్కి సినిమా ఎలా ఉంటుందంటే.. నాగ్ అశ్విన్ కామెంట్స్..

తాజాగా డైరెక్టర్ నాగ్ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. అందులో కల్కి సినిమా, కంటెంట్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కలి యుగంలో ఏం జరగబోతుంది.. ఎలా జరగొచ్చు అనే అంశాలను ఆధారంగా చేసుకుని కల్కి చిత్ర కథ రాసుకున్నానని.. ఈ స్టోరీ కంప్లీట్ అయ్యేసరికి ఐదేళ్లు పట్టిందన్నారు.

Nag Ashwin: కలి యుగంలో ఏం జరగబోతుంది.. కల్కి సినిమా ఎలా ఉంటుందంటే.. నాగ్ అశ్విన్ కామెంట్స్..
Kalki 2898
Follow us

|

Updated on: Jun 19, 2024 | 2:41 PM

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి 2898 ఏడీ. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. భారతీయ పురాణాలతో ముడిపడిన ఈసైన్స్ ఫిక్షన్ సినిమాను చూసేందుకు అడియన్స్ ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా డైరెక్టర్ నాగ్ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. అందులో కల్కి సినిమా, కంటెంట్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కలి యుగంలో ఏం జరగబోతుంది.. ఎలా జరగొచ్చు అనే అంశాలను ఆధారంగా చేసుకుని కల్కి చిత్ర కథ రాసుకున్నానని.. ఈ స్టోరీ కంప్లీట్ అయ్యేసరికి ఐదేళ్లు పట్టిందన్నారు.

“చిన్నప్పటి నుంచి పౌరాణిక చిత్రాలంటే ఎంతో ఇష్టం. పాతాళ భైరవి, భైరవ ద్వీపం, ఆదిత్య 369 ఇలా ప్రతి సినిమా విభిన్నమైనదే. హాలీవుడ్ నుంచి వచ్చిన స్టార్ వార్స్ చూసినప్పుడు కూడా చాలా బాగున్నాయి. కానీ ఇవి మన కథలు కావా..? ఎప్పుడూ పాశ్చాత్య దేశాల నేపథ్యంలోనే జరగాలా.? అనిపించేది. మన పురాణాల్లో చదివిన గొప్ప యుద్ధం అంటే మహాభారతం. పెద్ద సంఖ్యలో గొప్ప పాత్రలు ఉంటాయి. కృష్ణావతారంతో అది ముగుస్తుంది. అక్కడి నుంచి కలియుగంలోకి ప్రవేశించినప్పుడు ఈ కథ ఇంకెలా వెళ్తుందనే సృజనాత్మక ఊహతో ఈ కథ రాశాను. కృష్ణుడి అవతారం తర్వాత దశావతారం కల్కి.

కలియుగంలో ఎలా జరగబోతుంది. ఎలా జరగొచ్చు అనేది ఇందులో చూపంచాం. మనం చదివిన పురాణాలన్నింటికీ ఇదొక అంతిమ ఘట్టంలా ఉంటుంది. కలి అనే పాత్ర ప్రతి యుగంలోనూ ఉంటుంది. ఒక యుగంలో రావణుడిలా.. మరో యుగంలో దుర్యోధనుడిలా .. ఇలా ఒక్కొక్క చోట ఒక్కొ రూపం తీసుకుంటే కలియుగానికి వచ్చేసరికి అది చివరి రూపం అనుకుంటే.. అతనితో పోరాటం ఎలా ఉంటుందనే ఆలోచనతో కథ రాస్తూ వచ్చేసరికి ఐదేళ్లు పట్టింది ” అంటూ చెప్పుకొచ్చారు నాగ్ అశ్విన్. దీంతో ఇప్పుడు కల్కి సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.