Lokesh Kanagaraj: ‘ఆ వార్తలు పూర్తిగా అసత్యం.. నాకు ఆయన ఆరోగ్యమే ముఖ్యం’.. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్..

ఇదిలా ఉంటే ప్రస్తుతం తలైవా రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇప్పటికే డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ తెరకెక్కిస్తోన్న వెట్టైయాన్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అక్టోబర్ 10న ఈ మూవీ రిలీజ్ కానుంది. అలాగే డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటిస్తున్నారు. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. అయితే కూలీ సినిమా చిత్రీకరణ కారణంగానే రజినీ ఆరోగ్యం దెబ్బతిందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి..

Lokesh Kanagaraj: 'ఆ వార్తలు పూర్తిగా అసత్యం.. నాకు ఆయన ఆరోగ్యమే ముఖ్యం'.. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్..
Lokesh Kanagaraj, Rajinikan
Follow us

|

Updated on: Oct 05, 2024 | 4:55 PM

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల అనారోగ్య సమస్యలతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. మూడు రోజులు చికిత్స అనంతరం గురువారం రాత్రి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నారు. అనంతరం తన ఆరోగ్యం కోసం ప్రార్ధించిన అభిమానులకు, సినీ ప్రముఖులకు, ప్రధానికి కృతజ్ఞతలు తెలిపుతూ ఓ పోస్ట్ చేశారు రజినీ. ఇదిలా ఉంటే ప్రస్తుతం తలైవా రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇప్పటికే డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ తెరకెక్కిస్తోన్న వెట్టైయాన్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అక్టోబర్ 10న ఈ మూవీ రిలీజ్ కానుంది. అలాగే డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటిస్తున్నారు. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. అయితే కూలీ సినిమా చిత్రీకరణ కారణంగానే రజినీ ఆరోగ్యం దెబ్బతిందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి..

కూలీ సినిమా షూటింగ్ ఒత్తిడి కారణంగానే రజినీ ఆరోగ్యం చెడిపోయిందంటూ కూలీ చిత్రయూనిట్ ను తప్పుబడుతూ పలు తమిళ యూట్యూబ్ ఛానల్స్ వార్తలు ప్రచురించాయి. దీంతో రజినీ ఆరోగ్యం పై నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన లోకేష్ కనగరాజ్ సదరు యూట్యూబ్ ఛానల్స్ పై మండిపడ్డారు. ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మొద్దని.. తమకు సినిమా షూట్ కంటే రజినీ సర్ ఆరోగ్యమే ముఖ్యమంటూ చెప్పుకొచ్చారు.

“సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలలో ఎలాంటి వాస్తవం లేదు. దాదాపు నెల రోజుల క్రితం వైజాగ్ షెడ్యూల్లో తన ఆరోగ్యం గురించి రజనీ సర్ మాతో చెప్పారు. తానొక సర్జరీ చేయించుకోవాల్సి ఉందన్నారు. ఈ క్రమంలోనే మేము సెప్టెంబర్ 28 నాటికి ఆయనకు సంబంధించిన ముఖ్యమైన షూటింగ్ పోర్షన్ కంప్లీట్ చేశాం. 30వ తేదీని ఆయన ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. నేను ఆయనతో మాట్లాడాను. ఆయన ఆరోగ్యం కంటే షూటింగ్ మాకు ముఖ్యం కాదు. కాబట్టి ఏదైనా విషయం పై పూర్తి అవగహన వచ్చిన తర్వాతే అలాంటి వార్తలు రాయండి అని కోరుతున్నాను” అంటూ లోకేష్ కనగరాజ్ చెప్పారు. అక్టోబర్ 15న రజినీ తిరిగి సెట్ లోకి అడుగుపెడతారని అన్నారు. బంగారం స్మగ్లింగ్ నేపథ్యంతో రాబోతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్, సత్యరాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మహారాష్ట్రలో "మేఘా" పవర్.. 9 జిల్లాల రైతులకు ప్రయోజనం
మహారాష్ట్రలో
కాఫీ, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వలన స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం.!
కాఫీ, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వలన స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం.!
రాజేంద్రప్రసాద్‏ను పరామర్శించిన, చిరంజీవి, అల్లు అర్జున్..
రాజేంద్రప్రసాద్‏ను పరామర్శించిన, చిరంజీవి, అల్లు అర్జున్..
తొలి మ్యాచ్‌లోనే పరాజయం.. టీమిండియా సెమీస్ చేరేనా? లెక్కలు ఇవిగో
తొలి మ్యాచ్‌లోనే పరాజయం.. టీమిండియా సెమీస్ చేరేనా? లెక్కలు ఇవిగో
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
ఆకులతో ఆరోగ్యం.. ఈ ఆకులను తీసిపారేయకండి.. ఈ విషయం తెలిస్తే..
ఆకులతో ఆరోగ్యం.. ఈ ఆకులను తీసిపారేయకండి.. ఈ విషయం తెలిస్తే..
యూట్యూబర్స్ ఫేక్ న్యూస్.. మండిపడ్డ డైరెక్టర్ లోకేష్..
యూట్యూబర్స్ ఫేక్ న్యూస్.. మండిపడ్డ డైరెక్టర్ లోకేష్..
ఈటాలీవుడ్ స్టార్ యాంకర్‌ను గుర్తు పట్టారా?అసలెందుకిలా మారిపోయింది
ఈటాలీవుడ్ స్టార్ యాంకర్‌ను గుర్తు పట్టారా?అసలెందుకిలా మారిపోయింది
వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తాగండి.. ఊహకందని లాభాలు
వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తాగండి.. ఊహకందని లాభాలు
జాతకంలో శని దోషమా..నివారణకు చేయాల్సిన పూజ, దానాలు ఏమిటంటే..
జాతకంలో శని దోషమా..నివారణకు చేయాల్సిన పూజ, దానాలు ఏమిటంటే..