AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : అప్పుడు 25 వేల సాయం.. ఇప్పుడు దాని విలువ రూ.5 కోట్లు.. ఆ ఇద్దరికి జీవితాంతం రుణపడి ఉంటాను..

సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి. తెలుగులో ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకులను అలరించారు. దర్శకుడిగానే కాకుండా ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే కొన్నాళ్లుగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మిస్టర్ మిడిల్ క్లాస్ టీజర్ లాంచ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Tollywood : అప్పుడు 25 వేల సాయం.. ఇప్పుడు దాని విలువ రూ.5 కోట్లు.. ఆ ఇద్దరికి జీవితాంతం రుణపడి ఉంటాను..
Director G. Nageswara Reddy
Rajitha Chanti
|

Updated on: May 28, 2026 | 3:18 PM

Share

తెలుగు ప్రేక్షకులకు హీరో శ్రీకాంత్ సుపరిచితమే. ఎన్నో అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన ఇప్పుడు సహయ నటుడిగా రాణిస్తున్నారు. శ్రీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న లేటేస్ట్ మూవీ మిస్టర్ మిడిల్ క్లాస్. ఇందులో లయ కీలకపాత్ర పోషిస్తుండగా.. డైరెక్టర్ జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ వేడుకకు డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ జి. నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్వీ కృష్ణారెడ్డి లేకపోతే తాను దర్శకుడిగా ఎదిగేవాడిని కాదని అన్నారు. తన తల్లిదండ్రుల తర్వాత తాను జవీతంలో మర్చిపోలేని వ్యక్తులు వీరిద్దరే అని అన్నారు. ఆ ఇద్దరికి తాను జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Sudheer Babu: నా వయసు 49 సంవత్సరాలు.. 365 రోజులు ఇదే తింటాను.. డైట్ సీక్రెట్ చెప్పిన సుధీర్ బాబు.

ఎస్వీ కృష్ణారెడ్డి దగ్గర పనిచేయకపోయుంటే తాను దర్శకుడిని అయ్యేవాడిని కాదని.. తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన ఉందని అన్నారు. తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో డ్యామ్ ఎత్తేసరికి తమ పంటపొలం కొట్టుకుపోయిందని.. పొలమంతా నీటమునిగిందని అన్నారు. అప్పుడు తనకు తనకు ఎస్వీ కృష్ణారెడ్డి రూ.25 వేలు సాయం చేశారని.. ఆ డబ్బు తన తండ్రికి ఇస్తే మళ్లీ పొలం బాగు చేయించారని అన్నారు. ఇప్పుడు ఆ 9 ఎకరాల పొలం రూ. 5 కోట్లు విలువ చేస్తుందని చెప్పుకొచ్చారు. మిస్టర్ మిడిల్ క్లాస్ సినిమాలో గోవిందుడిగా రాజేంద్రప్రసాద్ కనిపించనున్నారు.

ఎక్కువమంది చదివినవి : Trivikram : నాకు బాగా ఆవేశం తెప్పించిన పుస్తకం అది.. త్రివిక్రమ్ చెప్పిన ఈ బుక్స్ చదివితే జీవితం ఏంటో తెలుస్తుంది..

మిస్టర్ మిడిల్ క్లాస్.. చాలా కాలం తర్వాత శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న కావడంతో ఈ మూవీ పై మంచి బజ్ ఏర్పడింది. ఇది ఒక అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ. జికె & సిఎన్ (GK & CN) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మధ్యతరగతి కుటుంబాల కష్టాలు, వారి జీవనశైలిని ప్రతిబింబిస్తూ, హాస్యభరితంగా ఈ సినిమాను రూపొందించారు. ప్రతి మధ్యతరగతి వ్యక్తి తనని తాను ఈ కథలో చూసుకునేలా సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. చాలా సంవత్సరాల తర్వాత శ్రీకాంత్, లయ తిరిగి జంటగా నటిస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి : Ammoru Movie: అమ్మోరు సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్నా.. కారణం ఇదే.. టాలీవుడ్ హీరోయిన్..

ఎక్కువమంది చదివినవి : Suman Shetty : ఆ డైరెక్టర్ చెప్పడంతో హైదరాబాద్‏లో స్థలం కొని ఇల్లు కట్టాను.. ఇప్పుడు ధర ఎంతంటే.. సుమన్ శెట్టి..

Follow Us