కల్ట్ డైరక్టర్‌కే ఎందుకీ కష్టాలు?
దేవా కట్టా..తెలుగు సినిమా ఇండష్ట్రీలో ఒక కల్ట్ డైరక్టర్. సెన్సుబుల్ రైటర్. ఏకంగా రాజమౌళి లాంటి డైరక్టర్ బాహుబలి సినిమా కోసం దేవా కట్టాతో కొన్ని సీన్లు రాయించాడు. వెన్నెల అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌తో దర్శకుడిగా పరిచయమై.. ఆపై ‘ప్రస్థానం’ అనే కల్ట్ మూవీని తీసి తెలుగు సినీ పరిశ్రమను, ప్రేక్షకులను అభినందనలు అందుకున్న దర్శకుడు దేవా కట్టా. ఆ సినిమా కమర్షియల్‌గా ఏమేర విజయం సాధించిందన్నది పక్కన పెడితే.. దేవాకు మాత్రం గొప్ప పేరే […]
దేవా కట్టా..తెలుగు సినిమా ఇండష్ట్రీలో ఒక కల్ట్ డైరక్టర్. సెన్సుబుల్ రైటర్. ఏకంగా రాజమౌళి లాంటి డైరక్టర్ బాహుబలి సినిమా కోసం దేవా కట్టాతో కొన్ని సీన్లు రాయించాడు. వెన్నెల అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌తో దర్శకుడిగా పరిచయమై.. ఆపై ‘ప్రస్థానం’ అనే కల్ట్ మూవీని తీసి తెలుగు సినీ పరిశ్రమను, ప్రేక్షకులను అభినందనలు అందుకున్న దర్శకుడు దేవా కట్టా.
ఆ సినిమా కమర్షియల్‌గా ఏమేర విజయం సాధించిందన్నది పక్కన పెడితే.. దేవాకు మాత్రం గొప్ప పేరే తెచ్చిపెట్టింది. కానీ దాని తర్వాత అతను ఎంచుకున్న సినిమా దేవా కెరీర్‌ను మామూలు దెబ్బ కొట్టలేదు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ అనే సంస్థలో నాగచైతన్య హీరోగా ‘ఆటోనగర్ సూర్య’ సినిమా చేశాడతను. ఆ సంస్థ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని.. ఆటోనగర్ సినిమాను మధ్యలో వదిలేసింది. చాలా కాలం ఆ సినిమా పూర్తి కాక, విడుదలకు నోచుకోక ఆగిపోయింది.
చివరికి ఎంతో నెగెటివిటీ మధ్య రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితాన్నందుకుంది. అలా అని సినిమాలో కంటెంట్ లేదని కాదు..జస్ట్ టైం కలిసిరాలేదు అంతే. ముందు నుంచి ఉన్న నెగెటివిటీ ఈ సినిమాను దెబ్బ తీసింది. దీని వల్ల దేవా కెరీర్లో మూడేళ్లు వేస్ట్ అయ్యాయి. ఆ తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకోని కాస్త కమర్షియల్ జానర్ టచ్ చేస్తూ చేసిన ‘డైనమైట్’ డిజాస్టర్ అయింది.
దీంతో కొన్నేళ్లు విరామం తప్పలేదు. చివరికిప్పుడు తన ప్రస్థానం సినిమానే హిందీలో సంజయ్ దత్ హీరోగా రీమేక్ చేస్తే దానికి ఊహించని రిజల్ట్ వచ్చింది. అత్యంత దారుణంగా తొలి మూడు రోజుల్లో రూ.3 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసి షాకిచ్చిందీ చిత్రం. సంజయ్ దత్ లాంటి నటుడి సినిమాకు ఇలాంటి ఓపెనింగ్స్ అంటే దారుణం. పెట్టుబడిలో పదిశాతం వసూళ్లు కూడా కష్టంగా ఉండటం దారుణమైన విషయం. మరి అత్యంత క్రియేటివ్ డైరక్టరయిన ఆయనకే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు. సినిమాల్లో కంటెంట్ ఉన్నా కూడా జస్ట్ ఫేట్ కలిసిరాక ఆయన ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. మరి ఈ జీనియస్ డైరక్టర్ ఎప్పుడు ఫామ్‌లోకి వస్తాడో వేచి చూడాలి.