తలైవాతో పోటీ ఎందుకని.. వెనక్కి తగ్గిన సూపర్‌స్టార్?

సంక్రాంతికి టాలీవుడ్‌లో హంగామా మాములుగా ఉండదు. ప్రముఖ స్టార్లందరూ తమ సినిమాలను సంక్రాంతి బరిలో దింపేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇక 2020 పొంగల్ వార్‌కు ఇప్పటికే స్టార్ హీరోలు సై అంటున్నారు. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరూ’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురంలో, రజినీకాంత్ ‘దర్బార్’ సంక్రాంతికి వస్తున్నట్లు ముందుగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ లిస్ట్‌లో తాజాగా కళ్యాణ్ రామ్ ‘ఎంత మంచివాడవురా’ కూడా చేరిపోయింది. కళ్యాణ్ రామ్ సినిమా జనవరి 15న విడుదలవుతుంటే.. […]

తలైవాతో పోటీ ఎందుకని.. వెనక్కి తగ్గిన సూపర్‌స్టార్?
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 25, 2019 | 7:16 PM

సంక్రాంతికి టాలీవుడ్‌లో హంగామా మాములుగా ఉండదు. ప్రముఖ స్టార్లందరూ తమ సినిమాలను సంక్రాంతి బరిలో దింపేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇక 2020 పొంగల్ వార్‌కు ఇప్పటికే స్టార్ హీరోలు సై అంటున్నారు. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరూ’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురంలో, రజినీకాంత్ ‘దర్బార్’ సంక్రాంతికి వస్తున్నట్లు ముందుగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ లిస్ట్‌లో తాజాగా కళ్యాణ్ రామ్ ‘ఎంత మంచివాడవురా’ కూడా చేరిపోయింది.

కళ్యాణ్ రామ్ సినిమా జనవరి 15న విడుదలవుతుంటే.. రజనీకాంత్ ‘దర్బార్’ జనవరి 10న.. అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురంలో’ జనవరి 12న రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. వీళ్లందరి సంగతి బాగానే ఉందని గానీ.. సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాను కొంచెం లేట్‌గా విడుదల చేయాలని చూస్తున్నారట.

ముందుగా ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాను నిర్మాతలు జనవరి 11న రిలీజ్ చేయాలని భావించారు. అయితే దీనికి మహేష్ ససేమిరా అంటున్నాడని సమాచారం. రెండు బడా చిత్రాల మధ్య సినిమాను విడుదల చేస్తే కలెక్షన్స్‌పై తప్పకుండా ప్రభావం పడుతుంది. అంతేకాకుండా అటు తలైవా.. ఇటు స్టైలిష్ స్టార్ చిత్రాలు కాబట్టి వాటిపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉండటం కామన్.

అందుకే మహేష్ బాబు ఒక్క అడుగు వెనక్కి తగ్గాడని ఫిల్మ్‌నగర్ టాక్. కూల్‌గా జనవరి 14న సినిమాను విడుదల చేయాలని నిర్మాతలకు సూచించాడని వినికిడి.