Bobby Kolli: మా చిరంజీవిని మాకు ఇచ్చావు అని ఫ్యాన్స్ అంటున్నారు.. దర్శకుడు బాబీ ఆసక్తికర కామెంట్స్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించిన ‘వాల్తేరు వీరయ్య’ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో మెగామాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ వాల్తేరు వీరయ్య. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కించిన ఈ మెగా మాస్ ఎంటర్ టైనర్ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఘన విజయం సాధించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించిన ‘వాల్తేరు వీరయ్య’ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో మెగామాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో రీసెంట్ గా చిత్ర యూనిట్ ‘వీరయ్య విజయ విహారం’’ సక్సెస్ సెలబ్రేషన్స్ ని వరంగల్ హన్మకొండలో గ్రాండ్ గా నిర్వహించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ వేడుకలో ప్రత్యేక అతిధిగా పాల్గొన్నారు. భారీ ఎత్తున ప్రేక్షకులు, అభిమానులు హాజరైన వీరయ్య విజయ విహారం’’వేడుక వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో దర్శకుడు బాబీ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.. ‘వాల్తేరు వీరయ్య’ పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని చిరంజీవి అన్నయ్య జడ్జ్ మెంట్ తో ముందే నమ్మకం వచ్చింది. మా నాన్న గారు చిరంజీవి గారికి పెద్ద అభిమాని. నాన్న కాలం చేసిన తర్వాత వెంటనే షూటింగ్ కి రాగలిగానంటే దీనికి కారణం చిరంజీవి గారు. నాన్న గారికి నాలుగు నెలలు ముందే ఈ సినిమా రిజల్ట్ ని చెప్పి, మీ అబ్బాయి పెద్ద డైరెక్టర్ కాబోతున్నాడని ఆయనకి సంతృప్తిని ఇచ్చి పంపించిన చిరంజీవి గారికి జీవితాంతం రుణపడి వుంటాను అన్నారు.
ప్రతి క్షణం ఈ సినిమాని ప్రేమించి ఈ సినిమా చేశాను. మా చిరంజీవిని మాకు ఇచ్చావు అనే మాట అన్నయ్య అభిమానుల నుండి వింటూనే వున్నాను. వీరయ్య ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఇదంతా అన్నయ్య వలనే సాధ్యమైయింది. అన్నయ్య పై అభిమానంతో హైదరాబాద్ కి వచ్చి అన్నయ్య కెరీర్ లో నిలిచిపోయే వాల్తేరు వీరయ్యకి దర్శకుడు కావడం నా అదృష్టం. రవితేజ లేకుండా వాల్తేరు వీరయ్య లేదని అన్నయ్య అన్నారు. అది నిజం. అన్నయ్య పై ప్రేమతో రవితేజ గారు ఈ సినిమాని చేశారు. దేవి శ్రీ ప్రసాద్ కి కృతజ్ఞతలు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని ఎంతో ప్రేమించి తీశారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ సినిమాని ఇంత పెద్ద విజయాన్ని చేసిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు’’ తెలిపారు బాబీ.