AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: అల్లు అర్జున్ సినిమాకోసం అట్లీ భారీ రెమ్యునరేషన్.. అన్ని కోట్లు తీసుకుంటున్నాడా.?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన విషయం తెలిసిందే..బన్నీ ఇప్పుడు అన్ని పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఇటీవకే అట్లీ జవాన్ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే.. జవాన్ సినిమా భారీ విజయం సాధించింది. ఇక ఇప్పుడు అట్లీ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నారని టాక్.

Allu Arjun: అల్లు అర్జున్ సినిమాకోసం అట్లీ భారీ రెమ్యునరేషన్.. అన్ని కోట్లు తీసుకుంటున్నాడా.?
Allu Arjun, Atlee
Rajeev Rayala
|

Updated on: Mar 03, 2025 | 6:56 PM

Share

కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ క్రేజ్ ఇప్పుడు బాలీవుడ్ లోనూ విపరీతంగా పెరిగిపోయింది. మొన్నటి వరకు సౌత్ వరకే అట్లీ పేరు తెలుసు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. షారుక్‌తో ‘జవాన్‌’ సినిమా చేసి పెద్ద విజయాన్ని అందుకున్నాడు అట్లీ. జవాన్ సినిమా సంచలన విజయం సాధించడమే కాదు 1000కోట్ల వరకు వసూల్ చేసింది. దాంతో అట్లీ తో సినిమాలు చేయడానికి పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు క్యూ కడుతున్నాయి. అలాగే అట్లీ రెమ్యూనరేషన్ కూడా పెరిగింది. అయితే అట్లీ నెక్స్ట్ ఎవరితో సినిమా చేయనున్నాడు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో అట్లీ సినిమా చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. తాజాగా అట్లీ కి సంబందించిన ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో తెగ వైరల్ అవుతోంది.

రీసెంట్ గా అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ సినిమాతో రూ. 1800కోట్లకు పైగా వసూల్ చేసింది ఈ సినిమా. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప, పుష్ప 2 సినిమాలతో భారీ విజయాన్ని అందుకున్నాడు అల్లు అర్జున్. పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నారని టాక్ వినిపించింది. ఆతర్వాత అట్లీ పేరు తెరపైకి వచ్చింది. అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా కోసం అట్లీ భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని టాక్ వినిపిస్తుంది.

అల్లు అర్జున్ సినిమా కోసం అట్లీ రూ. 100కోట్లు తీసుకుంటున్నడని టాక్ కోలీవుడ్ లో వినిపిస్తుంది. ఈ టాక్ నిజమైతే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే దర్శకుడిగా అట్లీ నిలుస్తారు. ఇక సోషల్ మేసేజ్ లతో మాస్ సినిమాలు తీయడంలో అట్లీ ఫేమస్. కోలీవుడ్ లో దళపతి విజయ్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తనదైన ముద్ర వేసుకున్నాడు. అట్లీ, షారూఖ్‌ ఖాన్‌ కాంబోలో వచ్చిన ‘జవాన్‌’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ వద్ద 1000 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఆ తర్వాత అట్లీ పాన్ ఇండియా డైరెక్టర్‌గా పేరు సొంతం చేసుకున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.