Anudeep Kv: క్రేజీ హీరో కోసం కథ రాస్తున్న కేవీ అనుదీప్.. ఆ స్టార్ హీరో ఎవరంటే..

నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమా యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత రీసెంట్ గా ప్రిన్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు

Anudeep Kv: క్రేజీ హీరో కోసం కథ రాస్తున్న కేవీ అనుదీప్.. ఆ స్టార్ హీరో ఎవరంటే..
Anudeep Kv
Follow us

|

Updated on: Nov 03, 2022 | 4:33 PM

జాతిరత్నాలు సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు కేవీ అనుదీప్. అంతకు ముందు దర్శకుడు నాగ్ అశ్విన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన అనుదీప్.. జాతిరత్నాలు సినిమాతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమా యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత రీసెంట్ గా ప్రిన్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అనుదీప్. తమిళ్ హీరో శివకార్తికేయన్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కూడా కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చింది. తెలుగు తమిళ్ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. ఇక ఇప్పుడు అనుదీప్ ఎవరితో సినిమా చేయనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. అనుదీప్ నెక్ట్స్ ఓ క్రేజీ హీరోతో సినిమా చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది.

అనుదీప్ తన నెక్స్ట్ సినిమా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో ఉంటుందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రామ్ కోసం అనుదీప్ ఒక స్టోరీ కూడా సిద్ధం చేశారని అంటున్నారు. ఈ సినిమా కూడా అనుదీప్ స్టైల్ లో కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని అంటున్నారు. ప్రస్తుతం రామ్ బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవలే వారియర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రామ్. లింగు స్వామి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. ఇక ఇప్పుడు బోయపాటి దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు రామ్. ఈ సినిమాలో క్రేజీ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమానుంచి అదిరిపోయే అప్డేట్ రానుంది. ఇక ఈ సినిమా తర్వాత అనుదీప్ రామ్ పోతినేని సినిమా ఉంటుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!