AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్‏కు ఆ పాటంటే చాలా ఇష్టం. కార్‏లో ఆ సాంగ్ సీడీ లేకుండా ఉండదు.. రాజమౌళి..

జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ రాజమౌళి అనుబంధం గురించి చెప్పక్కర్లేదు. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. చివరగా వీరి కాంబోలో వచ్చిన ఆర్ఆర్ఆర్ ప్రపంచ వేదికపై సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఓవైపు తారక్ డ్రాగన్ చిత్రీకరణలో బిజీగా ఉండగా.. మరోవైపు జక్కన్న వారణాసి సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తారక్ కు ఇష్టమైన పాట గురించి జక్కన్న ఒక సందర్భంలో బయటపెట్టారు.

Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్‏కు ఆ పాటంటే చాలా ఇష్టం. కార్‏లో ఆ సాంగ్ సీడీ లేకుండా ఉండదు.. రాజమౌళి..
Jrntr, Rajamouli
Rajitha Chanti
|

Updated on: Jul 03, 2026 | 9:21 AM

Share

మాతృదేవోభవ సినిమా తెలుగు సినీ చరిత్రలో ఒక అజరామర క్లాసిక్‌గా నిలిచిపోయింది. మాతృత్వాన్ని, త్యాగాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు కే. అజయ్ కుమార్ మీడియాకు చాలా దూరంగా ఉండే వ్యక్తి. ఇటీవలే ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తన వ్యక్తిగత విషయాలతో పాటు, సినిమా విశేషాలను పంచుకున్నారు. సాధారణంగా సినిమా హిట్ అయితే దర్శకులు ప్రచారంలో ఉంటారు, కానీ అజయ్ కుమార్ మాత్రం దీనికి విరుద్ధం. ప్రచారంపై తనకు ఎప్పుడూ ఆసక్తి లేదని, పెద్ద హీరోలతో కలిసి పనిచేసినా ఫోటోలు తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదని ఆయన తెలిపారు. గూగుల్‌లో కూడా తన ఫోటోలు చాలా తక్కువగా ఉంటాయని, అవి కూడా ఇతరులు పంపినవేనని ఆయన అన్నారు. ఈ ప్రచార విముఖత కారణంగానే మాతృదేవోభవ వంటి గొప్ప సినిమాకు తానే దర్శకుడని చాలామందికి తెలియదని ఆయన పేర్కొన్నారు. ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికర విషయం ప్రస్తావనకు వచ్చింది. మాతృదేవోభవ చిత్రంలోని రాలిపోయే పువ్వా రాగాలెందుకే పాటంటే జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతో ఇష్టమట. ఈ విషయాన్ని ఎస్.ఎస్. రాజమౌళి స్వయంగా తనకు చెప్పారని అజయ్ కుమార్ గుర్తు చేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆ హీరోలాంటి మనిషి ఇంకొకరు ఉండరు.. పద్మ శ్రీ వచ్చిందని తెలిసి ఏమన్నారంటే.. మురళి మోహన్..

“నేను నీ ఫ్యాన్ అయ్యా, మీ మాతృదేవోభవ సినిమాతో ఎంత ఇంప్రెస్ అయ్యానో తెలుసా? జూనియర్ ఎన్టీఆర్ కు ఆ పాటంటే విపరీతమైన ఇష్టం. ఆయన కార్ లో నీ సీడీ లేకుండా ఉండదు” అని రాజమౌళి చెప్పినట్లు అజయ్ కుమార్ గుర్తుచేసుకున్నారు. మాతృదేవోభవ ఒక మలయాళ చిత్రానికి రీమేక్. ఒక భారీ ఎమోషనల్ కథను ఒక కొత్త దర్శకుడికి అప్పగించడం మామూలు విషయం కాదని అజయ్ కుమార్ అన్నారు. అయితే, నిర్మాత కే.ఎస్. రామారావు తన మొదటి చిత్రం కొంగుచాటు కృష్ణుడు లో కామెడీతో పాటు ఎమోషన్స్‌ను సమర్థవంతంగా బ్యాలెన్స్ చేయడాన్ని చూసి తనపై నమ్మకంతో మాతృదేవోభవ బాధ్యతను అప్పగించారని వివరించారు. మలయాళ కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్చడంలో రచయిత సత్యమూర్తి (దేవిశ్రీ ప్రసాద్ తండ్రి)తో కలిసి తాను శ్రమించానని అజయ్ కుమార్ తెలిపారు. సెంటిమెంట్ చిత్రాలను తెరకెక్కించడం కత్తిమీద సాము లాంటిదని, ఎందుకంటే ఒక సన్నివేశం కాస్త ఎక్కువైనా బోర్ కొడుతుందని, తక్కువైనా భావోద్వేగం పండదని ఆయన అన్నారు. అందువల్ల, సన్నివేశం నిడివి, దానిలోని భావోద్వేగ తీవ్రతను పకడ్బందీగా నియంత్రించుకోవడం చాలా ముఖ్యమని ఆయన చెప్పారు. ఇది లేకుండా సినిమా బోర్ కొట్టడమో, లేదా భావోద్వేగం పండకపోవడమో జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Arundhati Movie: అరుంధతి సినిమాను రిజెక్ట్ చేసి తప్పు చేశాను.. అతడు మాటలు విని వదిలేశా.. టాలీవుడ్ హీరోయిన్..

సినిమా షూటింగ్ సమయంలో ఎదురైన ఒక ఆసక్తికర సంఘటనను కూడా అజయ్ కుమార్ పంచుకున్నారు. మే నెలలో హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుండగా, రాలిపోయే పువ్వా పాటను రోడ్డుపై చిత్రీకరించాల్సి వచ్చిందట. ఫోటోగ్రాఫర్ రోడ్డు చాలా డ్రైగా ఉందని, వర్షం లేని కారణంగా గ్రీనిష్ లుక్ రాదని చెప్పారట. అయితే, అనూహ్యంగా అదే సమయంలో వర్షం పడటం, అది సినిమాకు కావాల్సిన వాతావరణాన్ని సృష్టించడం నిజంగా లక్కీ అని ఆయన అన్నారు. ఇలా అనేక సవాళ్లు, ఆసక్తికర సంఘటనల నడుమ మాతృదేవోభవ చిత్రం రూపుదిద్దుకుందని అజయ్ కుమార్ వివరించారు.

ఎక్కువ మంది చదివినవి :  Sunil: ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే.. నా గుండెను తాకింది.. సునీల్ కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : Tollywood: ఇంట్లోకి వెళ్లగానే సావిత్రిగారిని అలా చూసి ఏడ్చేశా.. మనిషి చిన్నగా అయిపోయి.. టాలీవుడ్ నటి కామెంట్స్..

Follow Us