Arundhati Movie: అరుంధతి సినిమాను రిజెక్ట్ చేసి తప్పు చేశాను.. అతడు మాటలు విని వదిలేశా.. టాలీవుడ్ హీరోయిన్..
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎవర్ గ్రీన్ హిట్ చిత్రాల్లో అరుంధతి ఒకటి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై థియేటర్లలో భారీ విజయాన్ని సాధించిన ఈ సినిమాకు ఇప్పటికీ విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ మూవీ వస్తుందంటే చాలు ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతుంటారు జనాలు. ఆ స్థాయిలో హిట్టైన ఈ సినిమాను రిజెక్ట్ చేసి తప్పు చేశానని అంటుంది టాలీవుడ్ హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..

టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి కెరీర్ మలుపు తిప్పిన సినిమా అరుంధతి. సూపర్ సినిమా తర్వాత ఆమె నటించిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. దీంతో తెలుగులో అనుష్కకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2009లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో అనుష్క జేజమ్మగా, అరుంధతిగా ద్విపాత్రాభినయం చేసింది. అలాగే పశుపతి పాత్రలో సోనూ సూద్ నటించారు. ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్లకు పైగా వసూల్లు రాబట్టి అప్పట్లోనే అత్యధిక వసూల్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇదెలా ఉంటే.. ఈ సినిమా ఛాన్స్ అనుష్క కంటే ముందు మరో హీరోయిన్ వద్దకు వెళ్లిందట. కానీ ఆమె తన మేనేజర్ మాటలు విని ఆ ఆఫర్ రిజెక్ట్ చేశానని.. తర్వాత ఎంతో బాధపడినట్లు చెప్పుకొచ్చింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. మలయాళీ ముద్దుగుమ్మ మమతా మోహన్ దాసు.
మమతామోహన్ దాస్.. మలయాళంలో స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్. ఎన్టీఆర్, రాజమౌళి కాంబోలో వచ్చిన యమదొంగ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే క్యాన్సర్ బారిన పడింది. దీంతో చికిత్స కోసం సినిమాలకు దూరంగా ఉండిపోయింది. క్యాన్సర్ జయించిన మమతా.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస సినిమాలతో మరోసారి వెండితెరపై సందడి చేస్తుంది. ఈ క్రమంలో గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ అరుంధతి సినిమా ఛాన్స్ గురించి చెప్పుకొచ్చింది. తనకు యమదొంగ కంటే ముందు శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న అరుంధతి సినిమా ఛాన్స్ వచ్చిందని అన్నారు. ఈ మూవీ కోసం తాను సైన్ కూడా చేశానని.. కానీ కొన్ని రోజులకే ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చినట్లు తెలిపింది. ఓ మేనేజర్ ఆ ప్రొడక్షన్ హౌస్ మంచిది కాదని చెప్పాడని.. ఆ సమయంలో తనకు సినిమా గురించి ఏమీ తెలియదని.. అలాగే టాలీవుడ్ గురించి కూడా అంతగా అవగాహన లేదని అన్నారు. తాను చిన్నప్పటి నుంచి ఎప్పుడూ తెలుగు సినిమాలు చూడలేదని.. భాష తెలియదు.. తొలి అవకాశం అరుంధతి సినిమా రావడం.. ఆ మేనేజర్ మాటలు విని వదిలేసినట్లు తెలిపింది.
ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో శ్యామ్ ప్రసాద్ అప్ సెట్ అయ్యారని.. అయినప్పటికీ ఆ సినిమా చేయాలని తను రెండు మూడు నెలలు అడుగుతూనే ఉన్నారని అన్నారు. ఆయన మాటలు పట్టించుకోలేదని.. కానీ తర్వాత ఏడాదికి రాజమౌళి ఫోన్ చేసి యమదొంగ ఆఫర్ చేశారని.. ఆ సమయంలో అరుంధతి సినిమా వదిలేసి తప్పు చేశావని అన్నారు. ఆ సమయంలో నా హృదయం పగిలిపోయింది అంటూ చెప్పుకొచ్చింది. ఒకవేళ మమతా అరుంధతి సినిమా చేసి ఉంటే ఆమె కెరీర్ మరోలా ఉండేది అంటున్నారు నెటిజన్స్.
ఎక్కువమంది చదివినవి : RRR Movie : అబ్బబ్బా.. ఏం మారింది భయ్యా.. ఆర్ఆర్ఆర్ సినిమా మల్లీని చూశారా.. ? అచ్చం హీరోయిన్‌లాగే ఉందిగా..
మమతా మోహన్ దాస్..
View this post on Instagram
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఖుష్బూ కూతురి పెళ్లిలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సందడి.. స్పెషల్ అట్రాక్షన్‌గా త్రిష.. వీడియోస్ ఇదిగో..
