AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dil Raju: ఏపీలోనూ ఫిల్మ్ అవార్డుల వేడుక.? దిల్‌ సే అంటూ టాలీవుడ్‌కు దిల్‌ రాజు విజ్ఞప్తి

యువర్‌ అటెన్షన్‌ ప్లీజ్‌. దయచేసి వినండి. హీరోలు, హీరోయిన్లు, దర్శక నిర్మాతలు, టెక్నీషియన్లకు విజ్ఞప్తి. షూటింగ్‌లో ఎంత బిజీగా ఉన్నా... దాన్ని పక్కన పెట్టండి. ప్రభుత్వాలు నిర్వహించే సినిమా వేడుకలకు తప్పనిసరిగా హాజరు కండి. ఇది మనందరి బాధ్యత అంటూ టాలీవుడ్‌కు దిల్‌ రాజు విజ్ఞప్తి చేశారు. దిల్ సే అంటూ దిల్‌ రాజు ఎందుకు ఇంతలా రిక్వెస్ట్‌ చేశారు? దాని వెనుక రీజన్‌ ఏంటి?

Dil Raju: ఏపీలోనూ ఫిల్మ్ అవార్డుల వేడుక.? దిల్‌ సే అంటూ టాలీవుడ్‌కు దిల్‌ రాజు విజ్ఞప్తి
Dil Raju
Ravi Kiran
|

Updated on: Jun 16, 2025 | 9:30 AM

Share

ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం సినీ అవార్డుల ప్రదానోత్సవాన్ని హైదరాబాద్ హైటెక్స్‌లో శనివారం నాడు గ్రాండ్‌గా నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్టుగా అటెండ్ అయిన ఈ వేడుకల్లో అవార్డులకు ఎంపికైన నటీనటులతో పాటు టాలీవుడ్‌కి చెందిన అనేకమంది సెలబ్రిటీలు తళుక్కున మెరిశారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్వహించిన ఈ వేడుకల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన సినిమాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు పురస్కారాలు అందజేశారు. ప్రశంసా పత్రంతో పాటు క్యాష్ ప్రైజ్ ను కూడా అందించారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత జరిగిన ఈ ఈవెంట్‌తో టాలీవుడ్‌లో సందడి వాతావరణం నెలకొంది. అయితే తెలంగాణలో జరిగినట్లే, ఏపీలో కూడా ఫిల్మ్ అవార్డుల వేడుకను అక్కడి ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించనుంది.

ఈ నేపథ్యంలో టాలీవుడ్‌కు చెందిన నటీనటులు, దర్శకనిర్మాతలు, సాంకేతిక నిపుణులకు బడా నిర్మాత దిల్‌ రాజు విజ్ఞప్తి చేశారు. అందరికీ చెబుతున్నా.. గుర్తు పెట్టుకోండి. అవార్డులు వచ్చినవాళ్లు స్వయంగా ఫంక్షన్‌కు వచ్చి స్వీకరించాలని దిల్ రాజు కోరారు. ఏ స్టేట్‌ అయినా, షూటింగ్స్‌లో ఎంత బిజీగా ఉన్నా రావాల్సిందేనన్నారు ఆయన. ప్రభుత్వంతో కలిసి నడవాల్సిన బాధ్యత సినీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్లందరిపై ఉందని, ఈ విషయాన్ని అందరు అర్థం చేసుకోవాలన్నారు FDC చైర్మన్‌.

అయితే తెలంగాణ సర్కార్ వైభవోపేతంగా నిర్వహించిన గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ ఫంక్షన్‌కు అవార్డులు వచ్చిన కొందరు నటీనటులు, డైరెక్టర్లు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు హాజరు కాలేదు. తమకు వచ్చిన అవార్డులను కూడా స్వీకరించలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకునే దిల్‌ రాజు ఈ విజ్ఞప్తి చేసి ఉంటారని టాలీవుడ్‌ వర్గాలు భావిస్తున్నాయి. భవిష్యత్తులో ఏపీలో జరగబోయే సినీ అవార్డుల ఫంక్షన్‌కు కూడా వాళ్లు డుమ్మా కొట్టకుండా ఉండేందుకు ఆయన ఈ కామెంట్లు చేశారని భావిస్తున్నారు.