Tollywood: సమంతతో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఇప్పుడెలా ఉందో.. ఏం చేస్తుందో తెలుసా?
సినీ ఇండస్ట్రీలో కొన్ని చిత్రాలు ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోతాయి. అలాంటి కోవకు చెందిన వాటిల్లో ఒకటి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'.
సినీ ఇండస్ట్రీలో కొన్ని చిత్రాలు ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోతాయి. అలాంటి కోవకు చెందిన వాటిల్లో ఒకటి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. శ్రీకాంత్ అడ్డాల డైరక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో మహేష్ బాబు, వెంకటేష్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. అలాగే అంజలి, సమంత హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో సమంతకు ముగ్గురు చెల్లెళ్లు.. వారిలో అందరికంటే చిన్న చెల్లి పాత్రలో నటించింది చైల్డ్ ఆర్టిస్ట్ రచన సహదేవ. ఈమె ఆ సినిమాలో ఒకే ఒక్క డైలాగ్‌తో తెగ ఫేమస్ అయిపోయింది.
మీకు ఈ చిత్రం హోటల్ సీన్ గుర్తుండే ఉండొచ్చు. అదేనండీ..! సమంత ఫ్యామిలీని కలిసేందుకు మహేష్ వస్తాడు కదా.. అది.. ఈ సీన్‌లో చక్కనైన గోదారి యాసలో ‘ఏంటీ వాటర్ ఇంకా కూలెక్క =లేదా’ అని డైలాగ్ చెప్పిన చిన్నారినే రచన. ఈమె ఆ ఒక్క డైలాగ్‌తో.. అప్పట్లో భలేగా ఫేమస్ అయింది. అయితే ఆ సినిమా తర్వాత మాత్రం మరే సినిమాలో కూడా నటించలేదు రచన.
స్వతహాగా డ్యాన్సర్ అయిన రచనకు 2019లో వివాహమైంది. తన భర్తతో కలిసి సింగపూర్‌లో సెటిల్ అయిన రచనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితేనేం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తన ఫోటోలను, ఫ్యామిలీ ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.