ఏంటీ మృణాల్ మరీ ఇలానా.? సమ్మర్ వేడికంటే హాట్‌గా సీతారామమ్ బ్యూటీ. షేక్ అవుతోన్న సోషల్ మీడియా.
మృణాల్ ఠాకూర్.. ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఒకే ఒక్క సినిమాతో తెలుగు కుర్రాళ్ల గుండెలను కొల్లగొట్టుందీ బ్యూటీ. ఈ సినిమా విజయంలో మృణాల్‌ది కూడా కీలక పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తన అందం, అభినయంతో మెస్మరైజ్...
మృణాల్ ఠాకూర్.. ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఒకే ఒక్క సినిమాతో తెలుగు కుర్రాళ్ల గుండెలను కొల్లగొట్టుందీ బ్యూటీ. ఈ సినిమా విజయంలో మృణాల్‌ది కూడా కీలక పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తన అందం, అభినయంతో మెస్మరైజ్ చేసిందీ చిన్నది. క్యూట్ లుక్స్, సూపర్ యాక్టింగ్‌తో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఎలాంటి ఎక్స్‌పోజింగ్ లేకుండా చీర కట్టులోనే సందడి చేసింది మృణాల్.
ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ చిన్నది.. నాని సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. తెలుగులో ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఈ బ్యూటీ.. బాలీవుడ్‌లో మాత్రం గ్లామర్ షోతో సిల్వర్ స్క్రీన్‌ని హీటెక్కిస్తోంది. ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ చిన్నది పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాను ఒక్కసారిగా షేక్ చేశాయి.
View this post on Instagram
సమ్మర్ వెకేషన్‌లో భాగంగా బీచ్‌లో సందడి చేసిన మృణాల్ బికినీలో దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాను హీటెక్కించింది. మునుపెన్నడూ కనిపించని విధంగా మృణాల్ దర్శనమివ్వడంతో కుర్రకారు గుండె జారినంత పనైంది. బ్లూ బికినీలో గ్లామర్ గేట్స్‌ను ఎత్తేసింది. మృణాల్ పోస్ట్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్లు ఓ రేంజ్‌లో లైక్‌లు, కామెంట్స్ కురిపిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..