AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేందయ్యా ఇది..! మర్యాద రామన్నలో కనిపించిన ఈ కుర్రాడు.. ఆ స్టార్ హీరోనా..

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వారణాసి సినిమా కోసం ఇండియా వైడ్ గా ఉన్న సినీ లవర్స్ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను జక్కన్న పాన్ వరల్డ్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇదేందయ్యా ఇది..! మర్యాద రామన్నలో కనిపించిన ఈ కుర్రాడు.. ఆ స్టార్ హీరోనా..
Hero
Rajeev Rayala
|

Updated on: Aug 14, 2026 | 12:03 PM

Share

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నవారణాసి సినిమా కోసం ప్రపంచం మొత్తం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వారణాసి సినిమాతో రాజమౌళి ఈసారి ఇండియన్ బాక్సాఫీస్ నే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రికార్డ్స్ కూడా బద్దలుకొట్టేలా కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆమధ్య విడుదలైన టైటిల్ టీజర్ తో పాటు రీసెంట్ గా మహేష్ బాబు బర్త్ డేస్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్స్ కూడా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. యాక్షన్ అడ్వెంచర్ తో పాటు టైం ట్రావెల్ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది. అలాగే మహేష్ ఈ సినిమాలో రాముడిగా కనిపించనున్నారు. ఇదిలా ఉంటే రాజమౌళి తెరకెక్కించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. వాటిలో మర్యాద రామన్న సినిమా ఒకటి.

ఇది కూడా చదవండి : అప్పుడు చిన్న పిల్లాడు.. ఇప్పుడు స్టార్ అయ్యాడు..! పెద్ద హీరో అయ్యుండి కూడా నా కాళ్లు పట్టుకున్నాడు

సునీల్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రం మర్యాద రామన్న మంచి విజయాన్ని అందుకుంది. 2010లో విడుదలైన ఈ ఫ్యామిలీ కామెడీ యాక్షన్ డ్రామా లో సలోని హీరోయిన్ గా నటించింది. అలాగే నాగినీడు, సుప్రీత్, ప్రభాకర్, బ్రహ్మాజీ, రావు రమేష్, చత్రపతి శేఖర్.. ఇలా భారీ తారగణం ఇందులో కనిపించింది. ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగే ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ను బాగా మెప్పించింది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోగా వెలుగొందుతున్న ఒక నటుడు ఇదే మర్యాద రామన్న సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : శ్రీదేవితో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా.? 90’స్ కిడ్స్ ఫేవరెట్ హీరోయిన్ ఆమె.. ఇప్పటికీ అదే అందం

అతను ఎవరో గుర్తుపట్టారా.? ఆయన చాలా ఫేమస్ నటుడు. మర్యాద రామన్న సినిమాలో సునీల్‌కు నాగినీడు ఇంటికి దారిచూపే రాయలసీమ కుర్రాడు ఓబులేశ్ పాత్రలో కొద్ది సేపు అలా కనిపిస్తాడీ టాలీవుడ్ క్రేజీ హీరో.. అతను శ్రీ సింహా కోడూరి. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తనయుడు ఆయన. శ్రీ సింహా ఛైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించాడు. విక్రమార్కుడు, ఎన్టీఆర్ హీరోగా వచ్చిన యమదొంగ, అలాగే మర్యాద రామన్న సినిమాలోనూ నటించాడు. ఇక హీరోగా మత్తువదలరా, మత్తువదలరా 2, తెల్లవారితే గురువారం, ఉస్తాద్, భాగ్ సాలే సినిమాలు చేశాడు. ఇక ఇటీవలే పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ స్టార్ట్ చేసిన ఈ హీరో సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చాడు.

ఇది కూడా చదవండి : 12 ఏళ్ల వయసులోనే పెళ్లి.. నిండు గర్భంపై కాలితో తన్నిన భర్త.. ఈ నటి జీవితంలో ఇంత విషాదమా..!!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నేడు జాతినుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం!
నేడు జాతినుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం!
ఆగస్టు 15కి ముందే స్వాతంత్ర్య వేడుకలు.. ఈ 2ఆలయాల్లో ప్రత్యేకత..
ఆగస్టు 15కి ముందే స్వాతంత్ర్య వేడుకలు.. ఈ 2ఆలయాల్లో ప్రత్యేకత..
చంద్రుని చల్లని చూపు.. శ్రావణ మాసంలో శుభవార్తలు అందుకునే రాశులివే
చంద్రుని చల్లని చూపు.. శ్రావణ మాసంలో శుభవార్తలు అందుకునే రాశులివే
పిండి రుబ్బేటప్పుడు ఇదొక్కటి వేస్తే చాలు..ఇడ్లీలు మెత్తగా వస్తాయి
పిండి రుబ్బేటప్పుడు ఇదొక్కటి వేస్తే చాలు..ఇడ్లీలు మెత్తగా వస్తాయి
ఏపీకి రెయిన్ అలర్ట్.. మూడ్రోజుల పాటు వర్షాలు
ఏపీకి రెయిన్ అలర్ట్.. మూడ్రోజుల పాటు వర్షాలు
9 వేల రన్స్.. 22 సెంచరీలు.. అయినా ఒక్క టెస్ట్ ఆడని మనోడు
9 వేల రన్స్.. 22 సెంచరీలు.. అయినా ఒక్క టెస్ట్ ఆడని మనోడు
తొందరపాటు నిర్ణయాలు వద్దూ.. ఈ రాశి వారు మాట జారితే అన్నీ బాధలే
తొందరపాటు నిర్ణయాలు వద్దూ.. ఈ రాశి వారు మాట జారితే అన్నీ బాధలే
స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం మధ్య తేడా ఏంటి..?
స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం మధ్య తేడా ఏంటి..?
బంగారం కొనడానికి ఇది మంచి సమయం.. కుబేరుడి అనుగ్రహంతో వీరికి డబ్బే
బంగారం కొనడానికి ఇది మంచి సమయం.. కుబేరుడి అనుగ్రహంతో వీరికి డబ్బే
ఆయనతో కలిసి 15 సినిమాలు చేశా.. కానీ
ఆయనతో కలిసి 15 సినిమాలు చేశా.. కానీ