AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ రివ్యూ.. సూర్య, వెంకీ అట్లూరి కలిసి మ్యాజిక్ చేశారా లేదా..?

‘వీరభద్రుడు’ లాంటి విజయం తర్వాత సూర్య హీరోగా నటించిన సినిమా 'విశ్వనాథ్ అండ్ సన్స్'. 'లక్కీ భాస్కర్' తర్వాత వెంకీ అట్లూరి చేసిన సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.. మమితా బైజు హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో రవీనా టాండన్, రాధికా శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దామా..?

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ రివ్యూ.. సూర్య, వెంకీ అట్లూరి కలిసి మ్యాజిక్ చేశారా లేదా..?
Vishwanath And Sons
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Aug 14, 2026 | 12:39 PM

Share

మూవీ రివ్యూ: విశ్వనాథ్ అండ్ సన్స్

నటీనటులు: సూర్య, మమిత బైజు, రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్, సునీల్ రెడ్డి, నాజర్ తదితరులు

సినిమాటోగ్రఫీ: నిమిష్ రవి

సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్

ఎడిటింగ్: నవీన్ నూలి

నిర్మాత: సూర్యదేవర నాగవంశీ

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: వెంకీ అట్లూరి

కథ:

సంజయ్ విశ్వనాథ్ (సూర్య) ఓ మల్టీ మిలినియర్. ఒలంపిక్స్‌లో షూటింగ్‌లో గోల్డ్ మెడల్ కూడా తెస్తాడు. నాలుగు పదుల వయసు దాటినా పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉండిపోతాడు. తండ్రి తన మొదటి భార్య నిర్మల (రాధికా శరత్ కుమార్) అయిన కన్నతల్లిని వదిలేసి.. హీరోయిన్ అయిన అంజలి దేవి (రవీనా టాండన్‌)ను వివాహం చేసుకోవడంతో అతనికి బంధాల మీద విరక్తి ఏర్పడుతుంది. అయితే తల్లి కోరిక మేరకు సరోగసి పద్ధతిలో ఒక మగ బిడ్డను కంటాడు. పుట్టిన బాబుకు బోన్‌కు సంబంధించిన సమస్య రావడంతో ఆ బిడ్డను మోసిన మ్యాడీ (మమిత బైజు) సహాయం అవసరమవుతుంది. డబ్బు అవసరం కోసం ఆమె అతనికి సాయం చేయడానికి ముందుకొస్తుంది. ఆ క్రమంలో సంజయ్‌ను ఆమె ఇష్టపడుతుంది. అగ్రిమెంట్ గడువు ముగిశాక వెళ్ళిపోవడానికి నిరాకరిస్తుంది. ఈ పంచాయితీ కోర్టుకు వెళుతుంది. ఆ తర్వాత తన బిడ్డను దక్కించుకోవడం కోసం హీరో ఏం చేశాడు? మ్యాడీతో ఎలాంటి తిప్పలు పడ్డాడు..? 20 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్న సంజయ్‌తో మ్యాడీ పెళ్లైందా లేదా అనేది అసలు కథ..

కథనం:

కుటుంబ బంధాలను తెరపై అందంగా ఆవిష్కరించడంలో దర్శకుడు వెంకీ అట్లూరి తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నాడు. పాత సినిమాల ఛాయలు ఉన్నప్పటికీ.. దానికి ఆధునికతను అద్ది అందమైన కుటుంబ కథా చిత్రంగా దీన్ని మలిచాడు. కోటీశ్వరుల ఇళ్లలో అయినా, పేదవారి ఇళ్లలో అయినా మానవ సంబంధాలు, ఆప్యాయతలు ఒకేలా ఉంటాయని దర్శకుడు ఈ సినిమాతో చెప్పే ప్రయత్నం చేశాడు. మొదట్లో హీరో ఆధిపత్యాన్ని, నేపథ్యాన్ని చూపించడానికి కొంత సమయం తీసుకున్నా.. హీరోయిన్ వచ్చినప్పటి నుంచి ఫన్ మొదలవుతుంది. అక్కడి నుంచి కథ పరుగులు పెడుతుంది. ఒక పక్క నవ్వులు పూయిస్తూనే, మరోవైపు కన్నీళ్లు పెట్టిస్తూ సినిమా సాగుతుంది. ముఖ్యంగా తల్లీకొడుకుల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రతి ఒక్కరి మనసును కదిలిస్తాయి. ఫస్టాఫ్ వరకు సరదాగా సాగిపోయిన చిత్రం, ఆ తర్వాత కాస్త వేగం తగ్గుతుంది. దర్శకుడు తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పకుండా నెమ్మదిగా చెప్పాడేమో అనిపిస్తుంది. ఒకే చోట కథ తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. చిన్నపాటి పట్టింపులను పక్కనపెట్టి కూర్చుని మాట్లాడుకుంటే ఎలాంటి కుటుంబ సమస్య అయినా పరిష్కారం అవుతుందనే సందేశం బాగుంది. క్లైమాక్స్ కూడా దర్శకుడు ఇంకొంత బలంగా రాసుకుని ఉంటే బాగుండేది. ఆయన ఎంచుకున్న ఏజ్ గ్యాప్ పాయింట్ కూడా ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. ఎలాంటి పెద్ద మలుపులు, భయపెట్టే అంశాలు లేకపోయినా.. ఒక స్వచ్ఛమైన ఫీల్ గుడ్ వాతావరణం సినిమా అంతటా కనిపిస్తుంది. మొదటి సగం అద్భుతంగా ఉన్నప్పటికీ, రెండో సగం మందకొడిగా సాగడం కాస్త నిరాశపరుస్తుంది. అయినా కూడా ఓ మంచి సినిమా చూసామనే ఫీలింగ్‌తోనే ఆడియన్స్ థియేటర్స్ నుంచి బయటికి వస్తారు. ముఖ్యంగా సూర్య, మమిత మధ్య వచ్చే సీన్స్.. మమిత, రాధిక మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగా వర్కవుట్ అయ్యాయి. మేకింగ్‌లో ఎక్కువగా త్రివిక్రమ్ మార్క్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

నటీనటులు:

మల్టీ మిలీనియర్‌గా, పట్టింపులున్న వ్యక్తిగా సూర్య తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ముఖ్యంగా ఒకప్పటి గజినిలోని సంజయ్ రామస్వామిని గుర్తు చేసాడు. ఆయన నటనకు ఎవరైనా ముగ్ధులు కావాల్సిందే. ఇక హీరోయిన్ మమిత బైజు తన అల్లరితో పాటు క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. చాలా సన్నివేశాల్లో తన నటనతో హీరోను కూడా మించిపోయి ఆకట్టుకుంది. తల్లి పాత్రలో సీనియర్ నటి రాధిక తన అనుభవాన్నంతా రంగరించి కంటతడి పెట్టిస్తుంది. మరో సీనియర్ నటి రవీనా టాండన్‌కి కూడా హుందాతనంతో కూడిన మంచి రోల్ దక్కింది. సినిమా అంతా హీరో వెనకే ఉండే పాత్రలో సునీల్ రెడ్డి బాగున్నాడున.. మిగతా వాళ్లంతా తమ తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు.

టెక్నికల్ టీం:

సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం కథలోని భావోద్వేగాలను మరింత ఎలివేట్ చేశాయి. సినిమాటోగ్రఫర్ నిమిష్ రవి ప్రతి ఫ్రేమ్‌ను చాలా కలర్ ఫుల్‌గా చిత్రీకరించాడు. నిర్మాణ సంస్థ ఎక్కడా రాజీ పడకుండా సినిమాను చాలా రిచ్‌గా నిర్మించింది. ఎడిటింగ్ విభాగం పనితీరు ఇంకాస్త మెరుగ్గా ఉంటే సినిమా వేగం పెరిగేది. దర్శకుడు వెంకీ అట్లూరి రాసుకున్న మాటలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. రొటీన్ సన్నివేశాలే ఉన్నా.. మాటలతో వెయిటేజ్ పెరిగింది.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా విశ్వనాథ్ అండ్ సన్స్.. నీట్ అండ్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్..!

Follow Us
‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ రివ్యూ..
‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ రివ్యూ..
ప్రపంచ రికార్డ్‌తో వైభవ్ బీభత్సం గుర్తుందా.. బుడ్డోడి ఊచకోత
ప్రపంచ రికార్డ్‌తో వైభవ్ బీభత్సం గుర్తుందా.. బుడ్డోడి ఊచకోత
ఇటుకలు లేకుండానే ఇల్లు కట్టుకోవచ్చు! అబ్బ.. సగం ఖర్చు తగ్గినట్లే
ఇటుకలు లేకుండానే ఇల్లు కట్టుకోవచ్చు! అబ్బ.. సగం ఖర్చు తగ్గినట్లే
స్వాతంత్ర్య దినోత్సవం స్పెషల్: విద్యార్థుల కోసం సూపర్ స్పీచ్ ఇది
స్వాతంత్ర్య దినోత్సవం స్పెషల్: విద్యార్థుల కోసం సూపర్ స్పీచ్ ఇది
ఇలాంటి కొడుకు ఏ తల్లికి ఉండకూడదు.. కుమారుడి వేధింపులు తట్టుకోలేక
ఇలాంటి కొడుకు ఏ తల్లికి ఉండకూడదు.. కుమారుడి వేధింపులు తట్టుకోలేక
రూ.10 వేలు పెరిగిన బంగారం ధరలు.. కొనాలంటే కష్టమే..
రూ.10 వేలు పెరిగిన బంగారం ధరలు.. కొనాలంటే కష్టమే..
80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం!
80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం!
కోచ్‌గా కాదు, అంతకుమించి.. పెద్ద బాధ్యతల్లోకి వీవీఎస్ లక్ష్మణ్‌..
కోచ్‌గా కాదు, అంతకుమించి.. పెద్ద బాధ్యతల్లోకి వీవీఎస్ లక్ష్మణ్‌..
మర్యాద రామన్నలో కనిపించిన ఈ కుర్రాడు.. ఆ స్టార్ హీరోనా..!!
మర్యాద రామన్నలో కనిపించిన ఈ కుర్రాడు.. ఆ స్టార్ హీరోనా..!!
బంపర్ ఆఫర్.. జస్ట్ రూపాయికే అదిరిపోయే మంత్‌లీ రిఛార్జ్‌ ప్లాన్!
బంపర్ ఆఫర్.. జస్ట్ రూపాయికే అదిరిపోయే మంత్‌లీ రిఛార్జ్‌ ప్లాన్!