ఏంటీ..! వరలక్ష్మీ శరత్ కుమార్ ఆ రెండు సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకుందా..

తెలుగులో లేడీ విలన్ గా మంది పేరు తెచ్చుకుంది. మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాలో జయమ్మగా ఆకట్టుకుంది. ఆమె చేసిన ఈ పాత్ర సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఆతర్వాత కూడా ఇదే తరహా పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. రీసెంట్ గా హనుమాన్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకుంది. హనుమాన్ సినిమాలో హీరో సిస్టర్ గా నటించి మెప్పించింది.

ఏంటీ..! వరలక్ష్మీ శరత్ కుమార్ ఆ రెండు సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకుందా..
Varalakshmi Sarathkumar
Follow us

|

Updated on: Apr 29, 2024 | 3:31 PM

హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత సపోర్టింగ్ రోల్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది వరలక్ష్మీ శరత్ కుమార్. తన తండ్రి సీనియర్ హీరో శరత్ కుమార్ లానే ఇండస్ట్రీలో నటనతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు లేడీ విలన్ గా మారి ప్రేక్షకులను అలరిస్తుంది వరలక్ష్మీ శరత్ కుమార్. ఇక తెలుగులో లేడీ విలన్ గా మంది పేరు తెచ్చుకుంది. మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాలో జయమ్మగా ఆకట్టుకుంది. ఆమె చేసిన ఈ పాత్ర సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఆతర్వాత కూడా ఇదే తరహా పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. రీసెంట్ గా హనుమాన్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకుంది. హనుమాన్ సినిమాలో హీరో సిస్టర్ గా నటించి మెప్పించింది.

ఓ వైపు సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తుంది. ప్రస్తుతం శబరీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు వరలక్ష్మీ శరత్ కుమార్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు.

సీనియర్ నటుడు కూతురు అయినప్పటికీ వరలక్ష్మీ శరత్ కుమార్ అంత సులభంగా ఇండస్ట్రీలొకి రాలేదు. ఆమె కూడా ఎన్నో ఆడిషన్స్ ఇచ్చి.. అవకాశాల కోసం తిరిగి తిరిగి సినిమాల్లోకి వచ్చారు. ఇదే విషయాన్నీ ఆమె ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. అలాగే శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ , అలాగే ప్రేమిస్తే సినిమాలో ముందుగా హీరోయిన్ గా వరలక్ష్మీని అనుకున్నారట. కానీ అనుకోని కారణాల వల్ల ఆమె ఆ సినిమాల్లో నటించలేదు. అయితే హీరోయిన్ గా సినిమాలు చేసి ఉంటే.. అటే వెళ్లిపోయేదాన్ని.. ఇప్పుడు ఇలా వరుస సినిమాలు చేసే దాన్ని కాదు అని తెలిపింది వరలక్ష్మీ. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.