Tollywood: లక్షల జీతమొచ్చే జాబ్ వదిలేసి సినిమాల్లోకి.. కట్ చేస్తే మొదటి మూవీతోనే 40 కోట్లు.. ఎవరో తెలుసా?
కార్పొరేట్ కంపెనీలో ఇంజినీర్ గా జాబ్.. నెలకు లక్షల్లో జీతం.. లగ్జరీ లైఫ్.. ఇలా అన్నిటినీ వదులుకుని సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడీ కుర్రాడు. కట్ చేస్తే మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. ఏకంగా 40 కోట్ల సినిమాతో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు.

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలుగొందుతోన్న వారిలో చాలా మంది గతంలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వారే. డాక్టర్లుగానో, ఇంజీనీర్లు గానో సేవలు అందించిన వారే. అయితే నటనపై మక్కవతో సినిమాల్లో నటించాలనే ఆసక్తితో లక్షల జీతమొచ్చే తమ జాబులకు రిజైన్ చేశారు. కష్టమో నష్టమో సినిమా ఇండస్ట్రీలోనే తమకు నచ్చిన పని చేసుకుంటూ కెరీర్ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకునే కుర్రాడు కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు. హైదరాబాద్ కు చెందిన ఈ కుర్రాడు మొన్నటివరకు టెక్ మహీంద్రా వంటి దిగ్గజ కంపెనీలో నెట్ వర్క్ ఇంజినీర్ గా చేశాడు. నెలకు లక్షల జీతం అందుకున్నాడు. అయితే ఖాళీ దొరికినప్పుడల్లా సినిమాలు చూస్తుండే వాడు. ముఖ్యంగా కరోనా వర్క్ ఫ్రమ్ హోమ్ లో సినిమాలు తెగ చూసేశాడు. సినీ ప్రముఖులు, డైరెక్టర్ల ఇంటర్వ్యూలు కూడా విన్నాడు. దీంతో ఒకరోజు ‘సారీ ఆనంద్ సర్’ అంటూ తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. హైదరాబాద్ కు వచ్చేసి సినిమా ఛాన్సుల కోసం వెతికాడు. హార్డ్ వర్క్ కు తోడు కాస్త అదృష్టం కూడా తోడైంది. అంతే మొదటి సినిమాతోనే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు.. యూత్ మెచ్చే కంటెంట్ తో బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. ఇంతకీ అతనెవరనుకుంటున్నారా? లిటిల్ హార్ట్స్ సినిమా డైరెక్టర్ సాయి మార్తాండ్.
ప్రస్తుతం తన రెండో సినిమాతో బిజీగా ఉండే ఈ యంగ్ డైరెక్టర్ రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. అందులో టెక్ మహీంద్రాలో నెట్‌వర్క్ ఇంజనీర్ గా పని చేసిన రోజులను గుర్తుకు తెచ్చుకున్నాడీ కుర్ర డైరెక్టర్. ‘పుణెలో నెట్ వర్క్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్న సమయంలో వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చారు. దీంతో నాకు చాలా సమయం దొరికేది. ఇందులో కాసేపు నిద్రపోయేవాడిని. చాలా సేపు సినిమాలు చూస్తూ సమయం గడిపేవాడిని. టెక్ మహీంద్రా కంపెనీలో గడిపిన కాలం నా జీవితంలో అత్యంత గుర్తుండిపోయే దశలలో ఒకటి. ‘క్షమించండి ఆనంద్ మహీంద్రా సర్’ ఇన్ని మధుర జ్ఞాపకాలనిచ్చిన టెక్ మహీంద్రాకు ధన్యవాదాలు. ఆ రోజులు నాకు ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటాయి’ అని ఈ పోస్టులో రాసుకొచ్చాడు సాయి మార్తాండ్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ పోస్ట్ ఇదిగో..
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




