AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధోని నుంచి దాదా వరకు.. వెండితెరపై పరుగులు పెడుతున్న క్రికెట్ బయోపిక్స్

ధోని నుంచి దాదా వరకు.. వెండితెరపై పరుగులు పెడుతున్న క్రికెట్ బయోపిక్స్

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 10, 2026 | 7:24 PM

Share

భారతీయులకు క్రికెట్ ఎంతటి భావోద్వేగమో, ఆ కథలను తెరపై చూపించిన బయోపిక్స్ కూడా అంతే ఆదరణ పొందుతున్నాయి. ఎంఎస్ ధోని నుంచి మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామి వరకు పలువురు క్రికెటర్ల జీవితాలు సినిమాలుగా వచ్చాయి. ఇప్పుడు సౌరవ్ గంగూలీ బయోపిక్ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. రాజ్‌కుమార్ రావ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇండియన్స్‌కి సినిమాతో పాటు క్రికెట్‌ కూడా బిగ్గెస్ట్ ఎంటర్‌టైన్మెంట్‌. భారతీయులకు క్రికెట్‌ కూడా ఓ మతం అన్నంత పాపులర్‌ ఇక్కడ క్రికెట్. అందుకే మన సినిమాల్లోనూ క్రికెట్‌ ఫ్లేవర్‌ కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. ముఖ్యంగా స్టార్‌ క్రికెటర్ల బయోపిక్స్‌, వెండితెర మీద కాసుల పంట పడిస్తున్నాయి. ఈ లిస్ట్‌లో మరో క్రేజీ బయోపిక్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇండియన్‌ స్క్రీన్ మీద స్పోర్ట్స్‌ పర్సన్‌ బయోపిక్‌గా వచ్చి ఘన విజయం సాధించిన సినిమా ఎంఎస్‌ ధోని – ది అన్‌టోల్డ్ స్టోరి. బయోపిక్‌ అయినా కమర్షియల్ ఎలిమెంట్స్‌ ఏ మాత్రం మిస్ అవ్వకుండా రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ జానర్‌లో మరిన్ని సినిమాలు చేసే కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ధోని సినిమా సక్సెస్ తరువాత సచిన్ బయోపిక్‌ కూడా ఆడియిన్స్‌ ముందుకు వచ్చింది. అయితే ధోని బయోపిక్‌ స్టైల్‌లో కమర్షియల్‌ సినిమాలా కాకుండా డాక్యుమెంటరీ రూపంలో తన బయోపిక్‌ను రూపొదించారు సచిన్‌, దీంతో ఈ సినిమాకు సంబంధించి కమర్షియల్‌గా పెద్దగా బజ్‌ లేదు. వ్యక్తి కథగా కాకుండా ఇండియా ఫస్ట్ వరల్డ్‌ కప్‌ విక్టరీ నేపథ్యంలో తెరకెక్కిన 83 సినిమాకి కూడా మంచి అప్లాజ్ వచ్చింది. మెన్‌ క్రికెట్‌ నుంచే కాదు.. విమెన్‌ క్రికెట్‌ నుంచి కూడా కొన్ని కథలు వెండితెర వరకు వచ్చాయి. ఇండియన్ క్రికెట్ టీమ్‌కు ఎన్నో అద్భుత విజయాలు అందించిన మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా శభాష్ మిథు సినిమాను రూపొందించారు. ఫాస్ట్ బోలర్‌ ఝులన్‌ గోస్వామి బయోపిక్‌తో ఆడియన్స్‌ ముందుకు వచ్చారు అనుష్క శర్మ. ఈ లిస్ట్‌ లోనే గంగూలీ బయోపిక్‌ కూడా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ను సరికొత్త పంథాలో నడిపించిన దాదా బయోపిక్‌లో రాజ్‌కుమార్‌ రావ్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా 2027 మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jr.NTR: ‘డ్రాగన్’ కోసం తారక్ టోటల్ ట్రాన్స్‌ఫర్మేషన్.. కొత్త లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా

వయసు పెరిగినా వేగం తగ్గలేదు.. టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న నలుగురు సీనియర్ స్టార్‌ల బిజీ షెడ్యూల్

ఇంటి పెరట్లో వింత శబ్దాలు.. వెళ్లి చూసిన ఓనర్ వెన్నులో వణుకు!

మైనర్ ను పెళ్లి చేసుకుని జైలుపాలయ్యాడు.. అక్కడి నుంచి తప్పించుకుని చివరికి ఇలా..

సముద్ర తీరంలో వింత వస్తువులు.. అంతరిక్షం నుంచి వచ్చినట్టుగా

Follow Us