స్టార్ హీరోల డేట్స్ కోసం దర్శకుల నిరీక్షణ.. టాలీవుడ్‌లో వెయిటింగ్ గేమ్ ఎప్పుడు ముగుస్తుంది?
టాలీవుడ్‌లో స్టార్ హీరోల బిజీ షెడ్యూళ్ల కారణంగా పలువురు అగ్ర దర్శకులు వెయిటింగ్‌లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుకుమార్, త్రివిక్రమ్, లోకేష్ కనగరాజ్, ఆదిత్య ధర్ వంటి దర్శకుల ప్రాజెక్టులు హీరోల డేట్స్ కోసం నిలిచిపోయాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో భారీ ప్రాజెక్టుల ప్రారంభం మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
టాలీవుడ్‌లో వెయిటింగ్‌లో ఉన్న దర్శకుల లిస్ట్ భారీగా పెరిగిపోతోంది. ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న హీరోల సినిమాలు డిలే అవుతుండటంతో ఆ తరువాత చేయాల్సిన సినిమాల దర్శకులు బెంచ్ మీదే వెయిట్ చేయాల్సి వస్తోంది. పాన్ ఇండియా రేంజ్ సినిమా చేయాలంటే నలుగురైదుగురు హీరోలకు మించి ఆప్షన్స్ లేకపోవటంతో బిగ్ థాట్స్‌తో వస్తున్న దర్శకులకు వెయిటింగ్ తప్పటం లేదు. మరి ఈ లిస్ట్‌లో ఉన్న దర్శకులెవరు.. వాళ్లను వెయిటింగ్‌లో పెడుతున్న హీరోలెవరు? పుష్ప 2తో పాన్ ఇండియా మార్కెట్‌ను షేక్ చేసిన సుకుమార్ ప్రజెంట్ తన నెక్ట్స్ సినిమా పట్టాలెక్కించేందుకు వెయిట్ చేస్తున్నారు. చాలా రోజుల క్రితమే రామ్ చరణ్‌తో సినిమా ఉన్నట్టుగా ప్రకటించినా ఆ మూవీ స్టార్ట్ అవ్వడానికి ఇంకా ఆరునెలల టైమ్ పట్టేలా ఉంది. పెద్ది రిలీజ్ తరువాత బ్రేక్ తీసుకున్న చెర్రీ… జనవరిలో షూటింగ్ స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. కాస్త అటు ఇటుగా అదే టైమ్‌కు ఆర్సీ 17 పట్టాలెక్కే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రజెంట్ ఆదర్శ కుటుంబం వర్క్‌లో బిజీగా ఉన్న గురూజీ, ఆ తరువాత ఎన్టీఆర్ హీరోగా భారీ మైథలాజికల్ మూవీ చేస్తున్నట్టుగా ప్రకటించారు. కానీ డ్రాగన్ వర్క్‌లో బిజీగా ఉన్న తారక్ ఆ సినిమా పూర్తయ్యే వరకు త్రివిక్రమ్ మూవీకి డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. డ్రాగన్ కోసం పూర్తిగా మేకోవర్ అయిన తారక్, ఆ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత మరోసారి మైథలాజికల్ మూవీ కోసం మేకోవర్‌కు టైమ్ తీసుకునే ఛాన్స్ ఉంది. అంటే మరో ఏడాది పాటు త్రివిక్రమ్ వెయిట్ చేయక తప్పేలా లేదు. బన్నీ కోసం వెయిటింగ్‌లో ఉన్న లోకేష్‌కు కూడా లాంగ్ బ్రేక్ తప్పేలా లేదు. ప్రజెంట్ రాకా షూటింగ్‌లో ఉన్న బన్నీ ఆ సినిమాను డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు. ఆ తరువాత షార్ట్ బ్రేక్ తీసుకొని ఏఏ 23ని పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేసుకున్నారు. కానీ ఈ ప్లానింగ్‌లో ఏ మాత్రం తేడా వచ్చినా.. రాకా షూటింగ్ కాస్త ఆలస్యమైనా… ఏఏ 23 సెట్స్ మీద వెళ్లేది, 2027 సమ్మర్ తరువాతే అన్న టాక్ వినిపిస్తోంది. ఇక ప్రభాస్ కోసం వెయిట్ చేస్తున్న దర్శకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న డార్లింగ్, మూడు సినిమాల షూటింగ్స్ ప్యారలల్‌గా కానిచ్చేస్తున్నారు. ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 మూవీస్ వర్క్ జరుగుతోంది. ఆ తరువాత సలార్ 2 సెట్స్ మీదకు వెళుతుందన్న టాక్ వినిపిస్తోంది. వీటిల్లో ప్రభాస్ ఏ సినిమాకు ముందు ప్రియారిటీ ఇస్తారన్నది ఆయనకు మాత్రమే తెలుసు. ఇంత బిజీ లిస్ట్‌లోకి రీసెంట్‌గా ధురంధర్ ఫేమ్ ఆదిత్యధర్ పేరు కూడా చేరింది. డార్లింగ్‌తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ప్లాన్ చేస్తున్న ఆదిత్యధర్‌కు ప్రభాస్ ఎలా డేట్స్ అడ్జస్ట్ చేస్తారో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jr.NTR: ‘డ్రాగన్’ కోసం తారక్ టోటల్ ట్రాన్స్‌ఫర్మేషన్.. కొత్త లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా
వయసు పెరిగినా వేగం తగ్గలేదు.. టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న నలుగురు సీనియర్ స్టార్‌ల బిజీ షెడ్యూల్
ఇంటి పెరట్లో వింత శబ్దాలు.. వెళ్లి చూసిన ఓనర్ వెన్నులో వణుకు!
మైనర్ ను పెళ్లి చేసుకుని జైలుపాలయ్యాడు.. అక్కడి నుంచి తప్పించుకుని చివరికి ఇలా..
ఇంటి పెరట్లో వింత శబ్దాలు.. వెళ్లి చూసిన ఓనర్ వెన్నులో వణుకు!
సముద్ర తీరంలో వింత వస్తువులు.. అంతరిక్షం నుంచి వచ్చినట్టుగా
మొబైల్ టార్చ్‌లైట్ వెలుగులో బస్సు నడిపిన డ్రైవర్
దేవుడా.. ఈ నగరానికి ఏమైంది.. ఓవైపు కోతులు..మరోవైపు శునకాల బీభత్సం
ప్రాచీన శివాలయానికి జాతీయ హోదా!
చైనాలో గుడ్డు కూర ధర ఎంతో తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ..

