AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. నెలకు రూ.2 లక్షల జీతంతో AP విద్యుత్ శాఖలో భారీగా ఉద్యోగాలు

AP TRANSCO AEE Recruitment 2026: రాష్ట్ర సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APCPDCL) ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు శుభవార్త అందించింది. అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (AEE) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేస్తూ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా మొత్తం 60 ఖాళీలను భర్తీ చేయనుండగా, వీటిలో 56 ఎలక్ట్రికల్‌, 3 సివిల్‌, 1 టెలికాం విభాగానికి చెందిన పోస్టులు ఉన్నాయి..

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. నెలకు రూ.2 లక్షల జీతంతో AP విద్యుత్ శాఖలో భారీగా ఉద్యోగాలు
APCPDCL AEE Recruitment
Srilakshmi C
|

Updated on: Jul 10, 2026 | 7:23 PM

Share

ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APCPDCL).. అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (AEE) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 60 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులన్నింటికీ ఎలక్ట్రికల్‌, టెలికాం, సివిల్‌ విభాగాల్లో ఖాళీలను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జులై 20, 2026వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

విభాగాల వారీగా పోస్టుల వివరాలు..

  • అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌) పోస్టుల సంఖ్య: 56
  • అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (సివిల్‌) పోస్టుల సంఖ్య: 3
  • అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (టెలికాం) పోస్టుల సంఖ్య: 1

ఏపీ సీపీడీసీఎల్‌లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత ఇంజినీరింగ్‌ విభాగాల్లో బీఈ లేదా బీటెక్‌ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అభ్యర్ధుల గరిష్ఠ వయోపరిమితి జులై 1, 2026 నాటికి 18 నుంచి 42 ఏళ్లు మధ్య ఉండాలి. నిబంధనల మేరకు ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులకు 47 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 52 ఏళ్ల వరకు వయసు ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జులై 20, 2026వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్‌ ఫీజు కింద అభ్యర్ధులు రూ.1000 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధుల తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి ప్రొబేషన్‌ కాలంలో నెలకు రూ.75,000 స్టైపెండ్‌ అందిస్తారు. ప్రొబేషన్‌ తరువాత నెలకు రూ.86,245 నుంచి రూ.2,08,915 వరకు జీతంగా చెల్లిస్తారు.

రాత పరీక్ష విధానం

ఆన్‌లైన్ రాత పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. కోర్‌ సబ్జెక్టులకు 70 మార్కులు, జనరల్‌ ఇంటలీజెన్స్‌ అండ్‌ రిజనింగ్‌కు 5 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌కు 7, ఇంగ్లిష్‌ లాంగ్వేజెస్‌కు 5, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌కు 8, కంప్యూటర్‌ నాలెడ్జ్‌కు 5 మార్కుల చొప్పున కేటాయిస్తారు. నెగెటివ్‌ మార్కులు ఉండవు.

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: జులై 20, 2026 రాత్రి 11:59 గంటల వరకు
  • ఆన్‌లైన్‌ మాక్‌టెస్టులు: ఆగస్ట్‌ 15, 2026 నుంచి అందుబాటులో
  • ఆన్‌లైన్‌ పరీక్షలు: ఆగస్ట్ 22, 2026 నుంచి ఆగస్ట్ 29, 2026 వరకు

ఏపీ సీపీడీసీఎల్‌లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
పోషకాల ఖజానా మటన్ లివర్ సెట్.. సింపుల్‌గా ఇలా చేస్తే..
పోషకాల ఖజానా మటన్ లివర్ సెట్.. సింపుల్‌గా ఇలా చేస్తే..
కారులో ఏదో తేడాగా ఉందని చెక్ చేసిన పోలీసులు షాక్!
కారులో ఏదో తేడాగా ఉందని చెక్ చేసిన పోలీసులు షాక్!
పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ ప్రకటన
పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ ప్రకటన
ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!
ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!
ఫస్ట్ నైట్‌కు ముందే వరుడి దారుణ హత్య.. ఓటీటీలో సూపర్ హిట్ సినిమా
ఫస్ట్ నైట్‌కు ముందే వరుడి దారుణ హత్య.. ఓటీటీలో సూపర్ హిట్ సినిమా
హార్దిక్ పాండ్యాకు మరో షాక్.. ఐపీఎల్‌ 2027 వరకు క్రికెట్‌కు దూరం?
హార్దిక్ పాండ్యాకు మరో షాక్.. ఐపీఎల్‌ 2027 వరకు క్రికెట్‌కు దూరం?
టాలెంట్ ఉన్నా వెలుగులోకి రాలేకపోయిన ఏడుగురు క్రికెటర్లు వీళ్లే
టాలెంట్ ఉన్నా వెలుగులోకి రాలేకపోయిన ఏడుగురు క్రికెటర్లు వీళ్లే
జియో మెగా ఐపీవో సునామీ.. ప్రారంభంలోనే రికార్డు స్థాయిలో స్పందన
జియో మెగా ఐపీవో సునామీ.. ప్రారంభంలోనే రికార్డు స్థాయిలో స్పందన
అందుకే ఆ ఫ్లాప్ తర్వాత ఆ డైరెక్టర్‌తో సినిమా చేయలేదు..
అందుకే ఆ ఫ్లాప్ తర్వాత ఆ డైరెక్టర్‌తో సినిమా చేయలేదు..
ఐదు సూపర్‌ఫాస్ట్ రైళ్లలో కొత్త సేవలు.. ఏఐ టెక్నాలజీతో క్లీనింగ్..
ఐదు సూపర్‌ఫాస్ట్ రైళ్లలో కొత్త సేవలు.. ఏఐ టెక్నాలజీతో క్లీనింగ్..