AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెన్సార్ కత్తికి చిక్కిన సినిమాలు.. విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకున్న బిగ్ ప్రాజెక్ట్స్!

సెన్సార్ కత్తికి చిక్కిన సినిమాలు.. విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకున్న బిగ్ ప్రాజెక్ట్స్!

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 10, 2026 | 7:30 PM

Share

బాలీవుడ్‌లో సత్లుజ్ సినిమా వివాదం మరోసారి సెన్సార్ బోర్డు పాత్రపై చర్చకు దారితీసింది. థియేటర్లలో విడుదలకు అనుమతి రాక ఓటీటీలో వచ్చిన ఈ చిత్రం అక్కడి నుంచి కూడా తొలగించబడింది. జననాయగన్, మాతృభూమి, ఎమర్జెన్సీ, ది కశ్మీర్ ఫైల్స్ వంటి సినిమాలు కూడా సెన్సార్ కారణాలతో ఆలస్యమైన నేపథ్యంలో ఇండస్ట్రీలో కొత్త చర్చ మొదలైంది.

బాలీవుడ్ మూవీ సత్లుజ్‌ వివాదం నేషనల్ లెవల్‌లో సంచలనంగా మారింది. దాదాపు నాలుగేళ్లుగా సెన్సార్‌ బోర్డ్‌తో పోరాడిన చిత్రయూనిట్ థియెట్రికల్ రిలీజ్‌కు లైన్‌ క్లియర్ కాకపోవటంతో ఓటీటీలో మూవీని రిలీజ్ చేసింది. కానీ డిజిటల్‌ నుంచి కూడా రెండు రోజుల్లోనే తొలగించాల్సి వచ్చింది. దీంతో ఇలా సెన్సార్ ఇబ్బందుల్లో ఉన్న సినిమాల గురించి డిస్కషన్ మొదలైంది. మోస్ట్ అవెయిటెడ్ మూవీ జననాయగన్ రిలీజ్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఈ ఏడాది జనవరిలోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడింది. ఇప్పటికీ క్లియరెన్స్ రాకపోవటంతో రిలీజ్ ఎప్పుడన్న విషయంలో క్లారిటీ రావటం లేదు. రియల్‌ ఇన్సిడెంట్స్‌ ఆధారంగా తెరకెక్కిన సల్మాన్‌ ఖాన్ మూవీ మాతృభూమి కూడా సెన్సార్‌ కారణంగానే డిలే అవుతోందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో స్పందించిన మేకర్స్ సెన్సార్‌ ఇబ్బందులేమీ లేవని చెప్పినా.. ఏ కారణంగా డిలే అవుతుందన్న క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. రీసెంట్‌ టైమ్స్‌లో ఎమర్జెన్సీ, ది కశ్మీర్‌ ఫైల్స్ లాంటి సినిమాలు కూడా సెన్సార్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఎన్నికలకు ముందే రిలీజ్ కావాల్సిన ఎమర్జెన్సీ సెన్సార్ క్లియరెన్స్ రాకపోవటంతో ఎలక్షన్స్ తరువాత రిలీజ్ అయ్యింది. ది కశ్మీర్‌ ఫైల్స్‌, ది కేరళ ఫైల్స్‌ లాంటి సినిమాలు కూడా ఎన్నో వాయిదాల తరువాతే ఆడియన్స్‌ ముందుకు వచ్చాయి. దీంతో సెన్సార్ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులకు సంబంధించి ఇండస్ట్రీలోనూ భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jr.NTR: ‘డ్రాగన్’ కోసం తారక్ టోటల్ ట్రాన్స్‌ఫర్మేషన్.. కొత్త లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా

వయసు పెరిగినా వేగం తగ్గలేదు.. టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న నలుగురు సీనియర్ స్టార్‌ల బిజీ షెడ్యూల్

ఇంటి పెరట్లో వింత శబ్దాలు.. వెళ్లి చూసిన ఓనర్ వెన్నులో వణుకు!

మైనర్ ను పెళ్లి చేసుకుని జైలుపాలయ్యాడు.. అక్కడి నుంచి తప్పించుకుని చివరికి ఇలా..

సముద్ర తీరంలో వింత వస్తువులు.. అంతరిక్షం నుంచి వచ్చినట్టుగా

Follow Us