Tollywood: పగలు చదువుతూ రాత్రి వాచ్‌మెన్ ..165 జీతం.. ఇప్పుడు కోట్ల ఆస్తులున్న స్టార్ యాక్టర్ .. ఎవరంటే?
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలుగొందుతోన్న వారిలో చాలా మంది చిన్న తనంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్న వారే. పొట్ట కూటి కోసం చిన్న చితకా పనులు చేసిన వారే. ఈ టాలీవుడ్ స్టార్ నటుడు కూడా ఇదే కోవకు చెందుతాడు.

మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామంలో పుట్టి పెరిగాడు. తండ్రి మామూలు రైతు. చదువుకోసం చిన్నతనంలోనే సొంతూరును వదిలి పెట్టాడు. మరి ఇంటికి దూరంగా పట్టణంలో చదువుంటే మాటలా? బోలెడు ఖర్చు. అందుకే పగలు కాలేజీకి వెళ్లి రాత్రి నైట్ వాచ్ మెన్ జాబ్ చేశాడు. కేవలం రూ.165ల జీతం తీసుకుని రాత్రింబవళ్లు కష్టించి పని చేశాడు. అందులో రూ.150 ఇంట్లో ఇచ్చి, మిగిలిన పదిహేను రూపాయలు తన ఖర్చులకి ఉంచుకున్నాడు. అదే సమయంలో నటనపై ఆసక్తి పెంచుకున్నాడు. తన దగ్గర ఉన్న కొద్ది పాటి డబ్బుతో ముంబై వెళ్లి యాక్టింగ్ లో కొన్ని వర్క్ షాపులకు కూడా హాజరయ్యాడు. ఆ తర్వాత నటనలోనూ ట్రైనింగ్ తీసుకున్నాడు.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అతి గొప్ప నటుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు.. భారత దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరిగా మారిపోయారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లిష్, భోజ్ పురీ, మరాఠీ, గుజరాతి తదితర భాషల్లోనూ స్టార్ నటుడిగా వెలుగొందుతున్నాడు. ఇంతకీ అతనెవరో తెలుసా? నటుడు సాయాజీ షిండే.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఠాగూర్’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు సాయాజీ షిండే. అందులో తన యాక్టింగ్, అలాగే తన వాయిస్ కు కూడా మంచి గుర్తింపు వచ్చింది. దీని తర్వాత పలు హిట్ సినిమాల్లోనూ నటించి మెప్పించాడు షిండే.పోకిరి,అతడు, రాఖీ,నేనింతే,కింగ్, అదుర్స్ తదితర చిత్రాకు షిండేకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. తెలుగులో దాదాపు అందరు హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్.
సాయాజీ షిండే లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
ఇప్పటికీ తెలుగుతో పాటు పలు భాషల్లోనూ నటుడిగా రాణిస్తున్నారు సాయాజీ షిండే. అయితే గతేడాది ఆయన రాజకీయాల్లోనూ అడుగు పెట్టారు. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరారు. దీని తర్వాత షిండే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. తన సొంత నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారని రూమర్లు వచ్చాయి. అయితే అదేమీ జరగలేదు. ప్రస్తుతం మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు షిండే.
సాయాజీ షిండే ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








